
అయితే ఈటల రాజేందర్ కు అసలు తెలంగాణ బిజెపి పార్టీ నుంచి సపోర్టు లేదు .. ఈ క్రమంలో కిషన్ రెడ్డి , బండి సంజయ్ కు మాత్రమే కాదు మురళీధర్ రావు లాంటి పార్టీ నేతలు కూడా ఆయనకు సపోర్టుగా ఉండటం లేదు .. అదే విధంగా ఈటల తన రాజకీయ అవసరం కోసమే పార్టీలో చేరాలని చాలామంది గుర్తుకు చేస్తున్నారు . అందుకే ఆయనకు అధ్యక్షుడిగా వద్దని అంటున్నారు .. ఇదే క్రమంలో డీకే అరుణ , రఘునందన్ రావు , తమకు అవకాశం ఇవ్వాలని పార్టీ హైకామండ్‌ని కోరుతున్నారు .. అయితే బిజెపి అధ్యక్ష పదవికి ఇంత డిమాండ్ పెరగడానికి కారణం కూడా లేకపోలేదు .. ఇప్పుడు అధ్యక్షులుగా నీ మతలయ్యే వారే వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు అలాగే ఉంటారు ..
ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపికి తెలంగాణలో మంచి అవకాశాలు ఉంటాయని ప్రచారం కూడా ఉంది .. ఈ క్రమంలో అధ్యక్షుడిగా ఉండి పార్టీని గెలిపిస్తే సీఎం పదవి వస్తుందని నమ్మకంతో ఉన్నారు .. అలాగే తాము పార్టీలో ఉండి కష్టపడిన దాన్ని బట్టి తమకు అవకాశం రావాలంటే ఈ సమయంలో పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని అందరూ అనుకుంటున్నారు .. ఈ క్రమంలో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.. ఎవరి ప్రయత్నాలు ఎలా ఫలిస్తాయో కాలమే సమాధానం చెప్పాలి.