
ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 3-4 ఏళ్ల తర్వాత మళ్లీ వైసీపీ పార్టీ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కష్టాల నుంచే వైసీపీ ఆవిర్భవించిందని ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉండటం మనకు కొత్త కాదు. 15 ఏళ్లలో 10 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉన్నామని గుర్తు చేశారు ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. వైసిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, తాడేపల్లిలోని YSRCP party కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించారు ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
ఈ సందర్భంగా ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. ప్రజల కష్టాల నుంచి వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించిందన్నారు. ప్రతిపక్షంలో కూర్చోవడం మనకు కొత్తేమీ కాదని వివరించారు. ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉందని తెలిపారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ సీపీనే అంటూ వ్యాఖ్యనించారు. కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని ఆగ్రహించారు.
ఇప్పటివరకు విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ చెల్లించలేదని ఫైర్ అయ్యారు ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. చంద్రబాబు పాలనలో పేదలు చదువులు మానేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పేద విద్యార్థులు కాలేజీలు మానేసి పొలం పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని ఆగ్రహించారు. ఇచ్చిన ఏఒక్క హామీ చంద్రబాబు నెరవేర్చలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
యువతకు అండగా వైఎస్సార్సీపీ పోరాడుతుందని తెలిపారు. ఫీజు రీయిం బర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. NTR కి వెన్నుపోటు పొడిచినట్టు... ఈ రోజు ప్రజలకు కూడా వెన్నుపోటు పొడుస్తున్నాడు చంద్రబాబు అంటూ నిప్పులు చెరిగారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు జగన్.