వైసిపి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా మీడియా ముందు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.. కాకినాడ పోర్టు వాటాల బదిలీలో తన పేరుని సిఐడి విచారణకు పిలిచిందని హాజరుకాక ఆయన పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు.. తనకు జగన్కు మధ్య కొన్ని విభేదాలు వచ్చేలా సృష్టించారని విజయసాయిరెడ్డి ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యే వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎదగడానికి తనను కిందికి లాగేలా చేశారని అందులో పాత్రధారులు ,సూత్రధారులు కూడా ఉన్నారని కోటరీ నుంచి బయటపడితేనే జగన్ భవిష్యత్తు ఉంటుందని వెల్లడించారు విజయసాయిరెడ్డి.


కోటరీకి అనుకూలంగా ఉంటేనే జగన్ దగ్గరకు వెళ్తారు అని లేకపోతే దూరం పెడతారనే విధంగా ఆరోపణలు చేశారు.. నాయకులు ఎప్పుడూ కూడా చెప్పుడు మాటలు నమ్మకూడదని తెలియజేయడం జరిగింది. చెప్పుడు మాటలు నమ్మితే పార్టీ నాయకుడే నష్టపోతారని కూడా తెలిపారు. కోటరీ మాటలు వినవద్దని జగన్ కి ఎన్నోసార్లు చెప్పినా కూడా అసలు తన మాటలను పట్టించుకోలేదని.. విరిగిన మనసు అతుక్కోదు వైసీపీలో మళ్ళీ చేరను అంటూ కూడా తెలియజేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.


జగన్కు మంచి జరగాలని ఇప్పటికీ కోరుతూనే ఉన్నానని వెల్లడించారు. లిక్కర్ స్కామ్ పైన పలు రకాల వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ లిక్కర్ స్కామ్ లో పాత్రధారి సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి నేనని ఆరోపిస్తున్నారు దీని గురించి మరిన్ని వివరాలు కూడా తెలియజేయాల్సి ఉందని వెల్లడించారు. కాకినాడ పోర్టు వాటాల బదిలీ పైన సాయి రెడ్డి తో పాటుగా ఐదు మంది పైన సిఐడి కేసుని నమోదు చేయడం జరిగింది..A1 గా విక్రాంత్ రెడ్డి, A2 గా విజయసాయిరెడ్డి, A3 గా శరత్ చంద్రారెడ్డి, A4 గా శ్రీధర్ A5 గా అరబిందో రియాలిటీ ఇన్ఫో ఉన్నట్లుగా తెలియజేశారు.అయితే ఈ కేసులో విక్రాంత్ రెడ్డికి కొంతమేరకు ఊరట లభించిందట. ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయక ఏపీ హైకోర్టు ఇచ్చింది.


అయితే ఈ కేసు పైన విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఇది రాజకీయ ప్రేరేపిత కేసని.. కెవి రావుతో తనకు ముఖ పరిచయం తప్ప ఎలాంటి లావాదేవీలు లేవని వెల్లడించారు.. కేవలం వైవి సుబ్బారెడ్డి కొడుకు మాత్రమే విశ్రాంత్ తనకు తెలుసని అతనితో స్నేహం మాత్రమే ఉందని ఒక అధికారి ఆదేశాలతోనే తన పేరు ఇరికించినట్లుగా కేవీ రావు వెల్లడించారని తెలిపారు విజయసాయిరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: