
- కాశీనాయన ఆశ్రమం కల్చివేత... కూటమి ప్రభుత్వం హైందవ ధర్మ వ్యతిరేకి..!
- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఆశ్రమంపై కుట్ర
- సనాతన ధర్మం పేరుతో పవన్ డ్రామాలు
- క్షమాపణ పేరుతో లోకేష్ రాజకీయ నాటకం
- కూటమి ప్రభుత్వం కేంద్ర అధికారులతో మాట్లాడి ఆశ్రమం కార్యక్రమాలు కొనసాగించాలి
- బీసీవై జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ డిమాండ్
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని కాశీనాయన ఆశ్రమం కూల్చివేత హైందవ ధర్మాన్ని అణిచివేసే కూటమి ప్రభుత్వ కుట్రలో భాగం అని బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ రోజు ఆ ఆశ్రమాన్ని సందర్శించిన రామచంద్ర యాదవ్ ఆశ్రమంలో అధికారులు బలవంతంగా కూల్చేసిన ఆశ్రమానికి సంబంధించిన కట్టడాలు, అన్నదాన సత్రము, గోశాల, వసతి సదుపాయాలు, కళ్యాణకట్టను సందర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ శ్రమంలో గత 28 సంవత్సరాల నుంచి అనేక అనేక ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి.. సుమారు చుట్టుపక్కలున్న నాలుగైదు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన భక్తులు ఈ ఆశ్రమానికి లక్షల్లో వస్తుంటారు.. 24 గంటల పాటు ఈ ఆశ్రమం అన్నదానానికి ఎంతో ప్రసిద్ధి అని... నిత్యం ఎన్నో వందలు, వేల మంది వచ్చినా... ఇక్కడ అన్నం లేదు అన్నది లేకుండా గత 28 ఏళ్లుగా అన్నదానం చేస్తున్నారని తెలిపారు. ఎన్నో ఆరాధన కార్యక్రమాలతో పాటు, వేలమంది అనాథలు ఎంత మంది వచ్చినా ఆశ్రయం కల్పించి మరీ అన్నదానం చేస్తుంటారని.... అతిపెద్ద గోశాలలో వందల గోవులను పోషిస్తున్నారని... ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతుంటే.. ఈ ఆశ్రమానికి భక్తులను రానివ్వకుండా అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కుట్రలు జరుగుతున్నాయని రామచంద్ర యాదవ్ మండిపడ్డారు.
ఆగష్టు నుండి ప్రభుత్వం కుట్ర..!
గతేడాది ఆగస్టు నెల నుంచి ఈ ఆశ్రమానికి అప్పటి వరకు ఉన్న ఆర్టీసీ బస్సు సౌకర్యం ఆపేసి భక్తులను అడ్డుకున్నారు.. ఆ తర్వాత విద్యుత్ శాఖ అధికారులను ప్రయోగించి విద్యుత్ నిలిపి వేస్తామని బెదిరించారు... ఆ తర్వాత అటవీ శాఖ అధికారులు కట్టడాలు కూల్చి వేస్తున్నామని బలవంతంగా ఆశ్రమాన్ని కూల్చివేశారని వాపోయారు. ఇక్కడ గత 28 సంవత్సరాల నుంచి ఎన్నో నిర్మాణాలు జరిగాయి.. అటవీశాఖ అధికారులు కూల్చివేసిన కట్టడాల్లో ఎంపీ ల్యాడ్స్ నిధులతో కట్టి... అధికారిక లాంఛనాలతో ప్రారంభించినవి కూడా ఉన్నాయి... అవి నిర్మాణం జరుగుతున్నప్పుడు అటవీ శాఖాధికారులకు ఇది అటవీ భూమి అన్నది తెలియలేదా ? అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ ఈ భూమి నిజంగానే అటవీశాఖకు సంబంధించింది అయితే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు... స్వామి ఆశ్రమ ఈ భూమికి ఒకటికి నాలుగురెట్లు భూమి అంటే... సుమారు 25 ఎకరాలలో ఈ ఆశ్రమం ఉంటే.. 100 ఎకరాలు కూడా ఇవ్వడానికి అటవీశాఖ ప్రాంతానికి .. 100 ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధపడ్డారని.. ఒకవేళ అలా కానిపక్షంలో ఈ ఆశ్రమంలో ఉన్న భూముల విలువకు రెండింతలు డబ్బులు ఇచ్చేందుకు కూడా సిద్ధపడినా కావాలనే ఆశ్రమాన్ని కూల్చివేసే దుర్మార్గపు చర్యలు చేపట్టారని రామచంద్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే రాష్ట, కేంద్ర ప్రభుత్వాలు స్పందించి ఈ చర్యలు మానుకోవాలని హెచ్చరించారు.
పవన్ ఇక రాజకీయాల్లో నటించడం ఆపాలి..!
కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరు చెప్పి బాప్టిజం స్వీకరించి సనాతన ధర్మ రక్షకుడు అని చెప్పుకుంటున్నా ఇలాంటి చర్యలు ఆయనకు కనపడడం లేదా అని ప్రశ్నించారు. పవన్ బయట రాష్ట్రాలలో దేవాలయాలు సందర్శిస్తూ సనాతన ధర్మ పరిరక్షకుడిని అని ప్రచారం చేసుకుంటూ రాష్ట్రంలో దేవాలయాలు కూల్చివేస్తున్నా.. ఆశ్రమాలు కూల్చివేస్తున్నా ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. దేవాలయాలకు సంబంధించిన ఉత్సవాలు జరుగుతుంటే... వేరే వర్గం వాళ్లు అడ్డుకుని ఇబ్బందులు పెడుతూ.. బాధితుల పైన తప్పుడు కేసులు పెడుతూ జైళ్లు పాలు చేస్తుంటే నోరు మొదపని పవన్ కళ్యాణ్ ఈ ఆశ్రమానికి సంబంధించిన ప్రధానమైన అటవీశాఖ తన ఆధీనంలో ఉన్నా ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమాలలో నటిస్తున్నాడు.. రాజకీయాల్లో నటిస్తున్నాడు.. కానీ సనాతన ధర్మం పేరు చెప్పి... ఇలాంటి నాటకాలు ఆడితే మాత్రం ప్రజలు క్షమించరని.. హైందవజాతి క్షమించదని.. ఇలాంటి డ్రామాలు ఆడడం మానుకుని ఇప్పటకి అయినా జరిగిన తప్పులు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్టు రామచంద్ర యాదవ్ తెలిపారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి నారా లోకేష్ ఆశ్రమం కూల్చివేత విషయంలో ఇచ్చిన స్టేట్‌మెంట్ కూడా కేవలం సానుభూతి పొందే స్టేట్‌మెంట్ అని... అధికారులు తెలియకుండా తప్పు చేశారని... అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పి తప్పు కప్పిపుచ్చుకోవడం చాలా హేయమైన చర్య అన్నారు. కేవలం ఇక్కడ భక్తుల్లో ఆగ్రహావేశాలు.. ఈ ప్రాంత ప్రజల్లో కోపాన్ని చల్లార్చడానికి లోకేష్ రాజకీయ నాటకం ఆడారే తప్పా ఇందులో పశ్చాత్తాపం లేదన్నారు. నిజంగా లోకేష్‌కు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ జరిగిన తప్పులను సవరించుకుని... వెంటనే ఇక్కడ కార్యక్రమాలు యధావిథిగా జరిగేలా కేంద్ర అటవీశాఖ అధికారులతో మాట్లాడి వీటిని పునురుద్ధరించాలని బీసీవై పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు.