
యువత పోరు ద్వారా గలమెత్తిన విద్యార్థులు వారి యొక్క తల్లితండ్రులు నిరుద్యోగుల పైన పోలీసులు దౌర్జన్యంగా చేస్తున్న పనులను తీవ్రంగా ఖండిస్తున్నానని.. పలుచోట్ల పోలీసులతో ఈ కార్యక్రమాలను అడ్డుకోవాలని చూసిన వాటన్నిటిని కూడా అధికమించి ఏడాది కాలంగా మీ ప్రభుత్వం పెడుతున్న కష్టాల పైన నిలదీయడం జరిగింది.. అలాగే నిరుద్యోగులు , విద్యార్థులు మీకు పంపిన తొలి హెచ్చరిక అంటూ చంద్రబాబును హెచ్చరించడం జరిగింది. పేదరికం వల్ల పెద్ద చదువులకు ఎవరు దూరం కాకూడదని ఒక దృఢ సంకల్పంతోనే మా ప్రభుత్వం విద్యాదీవెన ద్వారా సంపూర్ణ ఫీజు రిమెంబర్స్ ని అందించామంటూ తెలిపారు.
వసతి దీవెన ద్వారా హాస్టల్ మేస్ చార్జీలతో పాటుగా వారి తల్లిదండ్రుల పిల్లల ఖాతాలకి డబ్బులు జమ చేసేవారుమని.. అమలు చేసిన ఈ పథకాలను మీ ప్రభుత్వం పూర్తిగా నీరు కార్చింది అంటూ.. మీ గత పాలనలో జరిగిన ఆ చీకటి రోజులను మళ్లీ మీరు తీసుకువచ్చారంటూ తెలిపారు.2024 జనవరి మార్చి త్రైమాసికానికి సంబంధించి ఫీజు రిమెంబర్స్ డబ్బులు ఏప్రిల్ లో చెల్లించాల్సి ఉన్నది.. అక్కడి నుంచి ఫీజు రిమెంబర్స్ కింద ప్రతి త్రైమాసికానికి 2800 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది.. వసతి దీవెన కింద హాస్టల్ ఖర్చులకు మరొక 1100 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉన్నది ఇలా ఈ రెండు పథకాల కోసం 3900 కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసి ఉన్నదని.. కానీ మీరు ఇచ్చింది 700 కోట్లు మాత్రమే అంటూ అది కూడా ఇప్పటికీ పిల్లలకు పూర్తిగా చేరలేదని లేఖ రాశారట.