
రాజకీయాలలో ఏం సాధించారు ఎంత సంపాదించారనే విషయం కాకుండా విజయశాంతి సీనియర్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా సీనియర్స్ అనగానే చాలామంది లగ్జరీ లైఫ్ లో కాస్ట్లీ కార్స్ లలో తిరుగుతూ ఉంటారని అనుకుంటూ ఉంటారు. ఇక విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్, విజయశాంతి దగ్గర 115 కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నదట. అయితే ఇందులో ఎక్కువగా భూములు ఉన్నాయట. విజయశాంతి పేరు మీద 67.5 కోట్ల రూపాయలు విలువ చేసి భూములు ఉన్నాయని తన భర్త మీద 45 కోట్ల రూపాయలు విలువ చేసి భూములు ఉన్నాయని తెలిపింది.
విజయశాంతి బ్యాంకు ఖాతా విషయానికి వస్తే ఈమె దగ్గర 5 లక్షల 92,000 నగదు ఉన్నట్లు తెలియజేసింది. తన భర్త దగ్గర 30,000 ఉన్నట్లు వెల్లడించింది. విజయశాంతి పై క్రిమినల్ కేస్ రికార్డులను సైతం విచారించగా తనమీద హనుమకొండ, సంగారెడ్డి ప్రాంతాలలో రెండు కేసులు ఉన్నాయని తెలియజేసింది. మొత్తానికి అఫిడవిట్లో తన ఆస్తి ఇంత ఉందని తెలియజేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే విజయశాంతి సీనియర్ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించిన విజయశాంతి పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇవ్వడంతో ఆమె సినిమాలకు దూరమైందనే విధంగా గతంలో వార్తలు వినిపించాయి. ప్రస్తుతమైతే తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలలో నటిస్తోంది.