ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవలే అసెంబ్లీలో సైతం తల్లికి వందనం పథకం పైన కీలకమైన అంశాల గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ పథకాన్ని వచ్చే మే నెల నుంచి ప్రారంభించబోతున్నట్లు తెలియజేశారు. ముఖ్యంగా తల్లుల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని మరి కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ఈ పథకాన్ని రూపొందించినట్లు తెలియజేయడం జరిగింది సీఎం చంద్రబాబు. అయితే ఈ పథకానికి సంబంధించి నిబంధనల పైన కూడా పలు విషయాలను తెలియజేయడం జరిగింది.


తల్లికి వందనం పథకానికి ఎటువంటి కఠినమైన నిబంధనలు ఉండవని క్లారిటీ ఇచ్చారు. ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి బిడ్డకు కూడా 15,000 చొప్పున అందిస్తామంటూ తెలిపారు. పిల్లల సంఖ్య పరిమితులు విధించకుండా ప్రతి కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం అందించేలా ఈ పథకాన్ని తీసుకువస్తున్నామంటూ వెల్లడించారు. అలాగే మహిళా ఉద్యోగుల కోసం మరొక కీలకమైన ప్రకటన చేస్తూ ఎంత మంది పిల్లలు ఉన్న ప్రతి ప్రసవానికి తగిన సెలవులు ఇచ్చే విధంగానే చర్యలు ఉంటాయంటూ తెలిపారు. మహిళ ఉద్యోగుల కోసం ఆరోగ్య పరిరక్షణ శిశు సంరక్షణకు ప్రత్యేకించి నిర్ణయాలు తీసుకుంటున్నామంటూ తెలిపారు.


గతంలో జనాభా నియంత్రణకు ప్రత్యేకమైన దృష్టి సాధించిన తానే ఇప్పుడు మళ్లీ జనాభాను పెంచాలని ప్రోత్సహిస్తున్నానంటూ తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం జనాభాను పెంచడం అవసరం అంటూ ప్రజల సంక్షేమం భవిష్యత్తు తరాల మెరుగైన వాటి కోసమే తల్లికి వందనం వంటి పథకాలను కూడా కీలకపాత్రలు పోషిస్తాయని తమ అభిప్రాయంగా తెలిపారు. మొత్తానికి తల్లికి వందనం పథకానికి ఎటువంటి ఆంక్షలు ఉండవంటూ తేల్చి చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. మరి ఇందుకు సంబంధించి మే నెలలో అన్ని విధావిధానాలు కూడా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీల విషయంలో తీవ్ర వ్యతిరేకత మొదలవుతూ ఉండడంతో తల్లికి వందనం పథకాన్ని అమలు చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: