ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ మినహా ఆ పార్టీని పట్టించుకునే వాళ్లు ఎవరూ లేరని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే వైసీపీ నేతలకు తాజాగా మరో భారీ షాక్ తగిలింది. మిథున్ రెడ్డి టార్గెట్ గా కూటమి సర్కార్ ఒకింత సంచలన ఆరోపణలు చేస్తుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.
 
తనపై వచ్చిన ఆరోపణల గురించి మిథున్ రెడ్డి మాట్లాడుతూ కూటమి సర్కార్ వరుసగా తమపై కుట్రలు చేస్తోందని ఆ కుట్రలకు ఏ మాత్రం భయపడేది లేదని మిథున్ రెడ్డి అన్నారు. చేసిన ఆరోపణలలో ఒక్క ఆరోపణ కూడా నిజం లేదని ఆయన కామెంట్లు చేశారు. చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్ కు అండగా నిలుస్తున్న నేతల విషయంలో చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
రాజకీయంగా జరుగుతున్న ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఆయన చెప్పుకొచ్చారు. కూటమి నేతలు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మిథున్ రెడ్డి చెప్పుకొచ్చారు. మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో దగ్ధమైన ఫైల్స్ విషయంలో మాపై బురద చల్లారని ఆయన కామెంట్లు చేశారు. రెవిన్యూ కార్యాలయంలో ఫైల్స్ ఆన్ లైన్ లో కూడా ఉంటాయని మిథున్ రెడ్డి పేర్కొన్నారు.
 
రాజకీయ పరమైన దురుద్దేశాలతో మాపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. మాపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని కోరుతున్నా సరైన స్పందన రావడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. గౌతమ్ తేజ అనే వ్యక్తిని టార్గెట్ చేశారని మిథున్ రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కూటమి సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ కు తెర లేపుతున్నారని ఆయన వెల్లడించారు. మిథున్ రెడ్డి చేసిన కామెంట్ల గురించి కూటమి వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది. మిథున్ రెడ్డి కామెంట్లు పొలిటికల్ వర్గాల్లో ఒకింత సంచలనం అవుతుండటం గమనార్హం.






మరింత సమాచారం తెలుసుకోండి: