
అయితే తాజాగా విజయ్ సాయి రెడ్డి జగన్ ని ఇరికించేటువంటి కాన్సెప్ట్లతో మాట్లాడుతున్నారు.. లేదా అవతలి వారు కోరుకుంటున్నట్లుగా మాట్లాడుతున్నారేమో అని అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. దీంతో వైసీపీలో ఉంటే నేతలు మాట్లాడడం మొదలుపెట్టారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.. వైయస్ జగన్ క్వార్టర్ అంటే అది ఆయన్ని అభిమానించే ప్రజలు 15 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వైసీపీ కార్యకర్తలే అంటూ ఆయన స్పష్టంగా తెలియజేశారు. ఏదైతే నిన్నటి వరకు వైయస్ జగన్ క్వార్టర్లలోనే ఉన్న విజయ్ సాయి రెడ్డి మళ్ళీ ఇప్పుడు క్వార్టర్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందంటూ తెలిపారు.
వైయస్ జగన్ కి అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఆయన విజయసాయిరెడ్డితో ఎలా వ్యవహరించారో ఆత్మ విమర్శ చేసుకోవాలని.. క్వాటర్ అనేది కూడా అన్ని రంగాలలో అన్ని వ్యవస్థలలో సాధారణంగా కనిపించేది.. టిడిపిలో చంద్రబాబు చుట్టూ క్వార్టర్ లేదా.. ఆ క్వార్టర్ల గురించి బయట ఉన్న వారు ఎవరైనా మాట్లాడితే బాగుంటుంది కానీ.. క్వార్టర్ గురించి క్వార్టర్ వ్యక్తులే మాట్లాడడం భావ్యమనిపించుకోదంటూ.. విజయసాయిరెడ్డి వైసీపీని విడిచి వెళ్లిపోయిన తర్వాత ఇంత పద్ధతిగా మాట్లాడుతానని మేము అనుకోలేదని తెలిపారు.. నిన్నటి రోజున విజయవాడలో మాట్లాడుతూ నిన్నటి వరకు ఏ పార్టీలో చేరబోయేది నిర్ణయం తీసుకునేది లేదని.. ఆయన మాటలలో మార్పు చాలా స్పష్టంగా భిన్నంగా కనిపిస్తోంది.. విజయసాయి రెడ్డికి ఒకరి మీద మనసు విరిగిపోతే .. ఇంకొకరి మీద ప్రేమ పుట్టింది అనుకోవాలి.. గత ఎన్నికలలో పార్టీ విజయం సాధిస్తే ఇలా మాట్లాడేవారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.. 2024లో తిరిగి జగన్ సీఎం అయి ఉంటే పార్టీ వీడిన వారు పార్టీని గురించి మాట్లాడుతున్న వారందరూ కూడా ఇలా మాట్లాడేవార అన్నట్టుగా పలువురు నేతలతో పాటు కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నారు?. విజయసాయిరెడ్డి వ్యవసాయం చేయరు రాజకీయాలే చేస్తారని ఆయన మాటల్లోనే స్పష్టంగా కనిపిస్తోంది. మరి అసలు ఏంటన్నది చూడాలి మరి.