జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ పెట్టి ఇప్పటికీ ఎన్నో ఏళ్లు అయినా చివరికి 2024 కూటమిలో భాగంగా మంచి విజయాన్ని అందుకొని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఏపీ డిప్యూటీ సీఎంగా కూడా హోదాని సంపాదించారు. ఇలా అధికారంలోకి వచ్చిన మొదటిసారి జనసేన పార్టీ  ఆవిర్భావ సభ చాలా గ్రాండ్గా చేయబోతున్నారు. మరి ఇందులో పవన్ కళ్యాణ్ తన మనసులో ఉండే మాటలను చెబుతారా అన్న ఆలోచనలు ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్నాయి.


పవన్ కళ్యాణ్ మాట్లాడే ప్రతి మాటలలో ఒక అర్థం ఉంటుంది. పవన్ స్పీచ్ లకు బాగానే క్రేజ్ ఉన్నది. అయితే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ తన స్పీచ్ లలో వాడి వేడి తగ్గించేసారని చర్చలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో లాగా పవన్ కళ్యాణ్ విరుచుకుపడడం కుదరదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉండగా కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 9 నెలలు అవుతూ ఉన్న ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆయన కోరుకుంటున్నారు గా ప్రభుత్వం కొనసాగుతోందా అనే చర్చ కూడా ఇప్పుడు మొదలయ్యిందట.


పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వ పనితీరు పట్ల ఎన్నో రకాలుగా గతంలో ప్రశ్నించారు అయితే ఇప్పుడు తమ ప్రభుత్వ పనితీరు పట్ల ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు అన్నదే చర్చనీయాంశంగా మారుతున్నది. ముఖ్యంగా ప్రజలకు చెప్పింది చేయాల్సి ఉన్నది వారికి ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోవాల్సి ఉన్నది.. మరి కూటమి ప్రభుత్వంతో ఏవిధంగా సాగుతోందా అనే చర్చ కూడా ఇప్పుడు మొదలయ్యిందట. సూపర్ సిక్స్ హామీలు కూడా పెద్దగా నెరవేర్చకపోవడంతో ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అధికారంలోకి వచ్చిన కొన్నిచోట్ల ఇప్పటికి పాత విధానాలే అమలవుతూ ఉన్నాయట. కూటమి తరపు నుంచి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు నెరవేర్చారా..? ఎంతవరకు పవన్ కళ్యాణ్ కూటమిలో సంతృప్తిగా ఉన్నారు అన్నది ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలను బట్టి తేలిపోతుందని పలువురు కార్యకర్తలు తెలియజేస్తున్నారు. చాలా కాలంగా మీడియాకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ మరి తన మనసులో మాటలను ఏ విధంగా పంచుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: