
విజయశాంతి ఒక్కదానికే కాకుండా మరో నలుగురు కూడా ఏకగ్రీవం కావడం గమనార్హం. ఇందులో ప్రత్యేక విషయం ఏంటంటే... తెలంగాణ ఉద్యమకారులైన ముగ్గురికి ఈసారి ఎమ్మెల్సీ పదవి వచ్చింది. విజయశాంతి, దాసోజు sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>శ్రవణ్ కుమార్ అలాగే అద్దంకి దయాకర్ ఈ ముగ్గురు కూడా ఈసారి పదవులు దక్కించుకున్నారు. అప్పట్లో కెసిఆర్ పార్టీలోనే ఈ ముగ్గురు ఉండి తెలంగాణ కోసం పోరాటం చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ ముగ్గురు లీడర్లు బయటకు వెళ్లడం జరిగింది.
కానీ దాసోజు sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>శ్రవణ్ కుమార్ గులాబీ పార్టీలోనే ఉండి తాజాగా.... ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. మిగతా లీడర్లు అయిన విజయశాంతి అలాగే అద్దంకి దయాకర్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకగ్రీవం అయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే మీడియా సమావేశం నిర్వహించిన విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ తెలంగాణ సెంటిమెంటును తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేసారు రాములమ్మ.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారిని.. బిజెపి తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుందని రాములమ్మ... వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంటే ఏపీలో కూటమి వచ్చినట్టుగా తెలంగాణలో కూడా.. కూటమి సంకేతాలు ఉన్నట్లు చెప్పకనే చెప్పారు. దీనికి చంద్రబాబు నాయుడు లీడర్ గా ఉండే అవకాశాలు ఉన్నాయని... రాములమ్మ ఆరోపణ. అయితే చంద్రబాబు నాయుడు పేరు చెప్పకుండా బిజెపి పై భాండాలు వేస్తూ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి హాట్ టాపిక్ అయ్యారు రాములమ్మ. అయితే రాములమ్మ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారమే రేపుతోంది..