
అసలేం జరిగిందంటే నిన్న మొన్నటి వరకు అమరావతిలో మైక్రోసాఫ్ట్ సెంటర్ పెడుతున్నారంటూ ఊహాగానాలు షికార్లు చేశాయి. కానీ అసలు విషయం వేరే ఉంది. మైక్రోసాఫ్ట్ సెకండ్ సెంటర్‌ను వైజాగ్ లో పెట్టడానికి రంగం సిద్ధమైందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ టెక్ రంగానికి శుభవార్తే.
ఇదిలా ఉండగా, నారా లోకేష్ మైక్రోసాఫ్ట్‌తో ఒక భారీ ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం రాబోయే నాలుగైదు ఏళ్లలో రెండు లక్షల మంది బీటెక్ గ్రాడ్యుయేట్లకు మైక్రోసాఫ్ట్ స్వయంగా శిక్షణ ఇవ్వనుంది. శిక్షణ మాత్రమే కాదు, జాబ్ ఆపర్చునిటీస్ కూడా మైక్రోసాఫ్ట్ వాళ్లే చూసుకుంటారట.
ఇన్నాళ్లూ సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే హైదరాబాద్ అమీర్‌పేట, ఎల్బీనగర్ అంటూ ట్రైనింగ్ సెంటర్ల చుట్టూ తిరిగేవారు మన తెలుగు విద్యార్థులు. కానీ ఇప్పుడు సీన్ మారిపోనుంది. మైక్రోసాఫ్ట్ స్వయంగా రంగంలోకి దిగడంతో కన్సల్టెన్సీల హవా ఇక కష్టమే. ట్రైనింగ్ పేరుతో లక్షలు గుంజేసే సంస్థలకు చెక్ పెట్టేలా లోకేష్ వేసిన ఈ ప్లాన్ మాత్రం సూపర్ అంటున్నారు విశ్లేషకులు.
నిజంగా ఇది ఒక అద్భుతమైన ఆలోచన. ఇలాంటివి ఆంధ్రప్రదేశ్‌లో జరగాలని ఎప్పటినుంచో నిపుణులు కోరుతున్నారు. చిన్న చిన్న ట్రైనింగ్ సెంటర్లు, కన్సల్టెన్సీల మీద ఆధారపడకుండా ఏకంగా మైక్రోసాఫ్ట్‌నే పిలిచి శిక్షణ ఇప్పించడం అంటే మామూలు విషయం కాదు. ఇది నిజంగా గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు.
మొత్తానికి మైక్రోసాఫ్ట్ రాకతో ఆంధ్రప్రదేశ్ టెక్ రంగం కొత్త పుంతలు తొక్కడం ఖాయం. వైజాగ్ ఇకపై టెక్ హబ్‌గా మారుతుందా లేదా అనేది వేచి చూడాలి. కానీ ఈ ఒక్క ఒప్పందం మాత్రం ఆంధ్రప్రదేశ్ యువతకు టెక్నాలజీ స్వర్ణ యుగాన్ని తెస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.