
చిరంజీవి తర్వాత స్థానాన్ని అల్లు అర్జున్ ఆక్రమించారని దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో అల్లు అర్జున్ క్రేజ్ పెరిగిపోయిందని తెలియజేశారు.అందుకే ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ కావాలని మల్లారెడ్డి తెలియజేశారు.. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పూర్తిగా మారిపోయారని.. దాన్ని క్రేజ్ కూడా పెరిగిందని ఏకంగా 1800 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. కొత్త తరానికి అల్లు అర్జున్ బాగా కనెక్ట్ అయిపోయారనే విధంగా మాట్లాడుకుంటున్నారని హాలీవుడ్ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ ని ప్రశంసిస్తూ ఉన్నారంటూ మల్లారెడ్డి అల్లు అర్జున్ ని పొగడ్తలతో ముంచేస్తూ ఉన్నారు.
చిరంజీవి కొంతమేరకు గ్యాస్ తర్వాత ఖైదీ నెంబర్ 150 చిత్రంతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి పర్వాలేదు అనిపించుకున్న ఆ తర్వాత నటించిన చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి.. పాన్ ఇండియా హీరో అనే ట్యాగ్ ను పక్కన పడితే రెండు తెలుగు రాష్ట్రాలలో చిరంజీవి సినిమాలు అంటే ఆసక్తి చూపించలేకపోతున్నారట. చిరంజీవి క్రేజ్ అలాగే ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న కొత్త తరానికి కనెక్ట్ అయ్యేలా సబ్జెక్టులను ఎంచుకోలేకపోతున్నారు. ప్రస్తుతమైతే విశ్వంభర సినిమా పైన భారీగా అంచనాలు ఉన్నప్పటికీ మరి ఏ విధంగా ఏ సినిమా చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పుతుందో చూడాలి.