ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన, చరిత్ర తిరగరాసిన పార్టీ ఏదనే ప్రశ్నకు జనసేన పార్టీ పేరు సమాధానంగా వినిపిస్తుందనే సంగతి తెలిసిందే. జనసేనకు 2019లో ఎదురుదెబ్బలు తగిలినా పార్టీ పుంజుకుని 2024 సంవత్సరంలో మాత్రం చరిత్ర సృష్టించింది. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ సోలోగా కూడా సత్తా చాటే ఛాన్స్ అయితే ఉంది.
 
జనసేన పార్టీకి సంబంధించి ప్రస్తుతం విరాళాల సేకరణ జరుగుతోందని తెలుస్తోంది. సమాజాన్ని జనసేన పార్టీ బాగు చేస్తున్న నేపథ్యంలో విరాళాలు ఇవ్వాలనే దిశగా ప్రచారం సాగుతుండటం గమనార్హం. జనసేనను బలోపేతం చేయడానికి కార్యకర్తలు తమ వంతు కృషి చేయడం ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారని కచ్చితంగా చెప్పవచ్చు.
 
అయితే విరాళాలు మొదట ఎక్కువ మొత్తం వచ్చినా రోజులు గడిచే కొద్దీ ఈ విరాళాల మొత్తం తగ్గుతుంది. వచ్చిన విరాళాలతో పార్టీని నడపడం సాధ్యమవుతుందో లేదో కచ్చితంగా చెప్పలేము. జనసేన పార్టీ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ సైతం తన వంతు కృషి చేస్తుండటం గమనార్హం. జనసేన పార్టీ భవిష్యత్తులో సైతం టీడీపీ, బీజేపీతో కలిసి అడుగులు వేసే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.
 
పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ విషయానికి వస్తే ఈ నెల 28వ తేదీన హరిహర వీరమల్లు రిలీజ్ కావాల్సి ఉన్నా ఈ సినిమా మే నెలకు వాయిదా పడింది. హరిహర వీరమల్లు మూవీ మే నెల 9వ తేదీన రిలీజ్ అవుతుండగా ఈ సినిమా ఆ తేదీకైనా విడుదలవుతుందేమో చూడాల్సి ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ పెరుగుతుండగా పవన్ కు సినిమల్లో సైతం విజయాలు దక్కుతాయేమో చూడాలి. జనసేన పార్టీ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. జనసేన రాజకీయంగా మరిన్ని సంచలనాలు సృష్టిస్తారేమో చూడాలి. జనసేన రేంజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.








మరింత సమాచారం తెలుసుకోండి: