
కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని కాశీనాయన ఆశ్రామాన్ని అధికారులు కూల్చివేయడంతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. జరిగిన తప్పుకు క్షమాపణ చెప్పిన ఆయన ప్రభుత్వం తరఫున ఆశ్రమ నిర్వాహకులకు క్షమాపణలు చెప్పడంతో పాటు షెడ్లు తన సొంత నిధులతో పునర్ నిర్మిస్తానని మాటిచ్చిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ హామీ ఇచ్చిన 24 గంటల్లో షెడ్ల పునర్నిర్మాణం ప్రారంభ పనులు చేపట్టారు. వాస్తవానికి ఈ విషయం లో కూటమి ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి. హిందూ సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో మండి పడ్డాయి. కూటమి ప్రభుత్వం హిందూయిజానికి .. హిందూత్వానికి వ్యతిరేకంగా ఉందన్న విమర్శలు కూడా వచ్చాయి.
చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ పదే పదే సనాతన ధర్మం అంటారు ? ఈ విషయం లో ఏం చేస్తున్నారని ప్రతిపక్షాలు మండి పడ్డాయి.
ఈ సున్నితమైన అంశం పై లోకేష్ కాంట్రవర్సీ లేకుండా స్పందించారు. కాశీనాయన ఆశ్రమం షెడ్లు కూల్చివేసి, అటవీశాఖ అధికారులు తప్పుచేసినా.. కూటమి ప్రభుత్వం లో కీలక నేతగా ... బాధ్యత గల మంత్రిగా తప్పును సరిదిద్దే చర్యలను నారా లోకేష్ తీసుకున్నారు.. ఆశ్రమ నిర్వాహకులు జీరయ్యస్వామితో ఫోన్‌లో మాట్లాడడం తో పాటు జరిగిన సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇకపై ఏ అవసరం వచ్చినా, ఏ సమస్య ఉన్నా తననే నేరుగా సంప్రదించాలని స్వామికి భరోసా ఇచ్చారు.
కూల్చిన షెడ్లను తన సొంత నిధులతో పునర్నిర్మిస్తామని జీరయ్య స్వామితో చెప్పగా... ఈ మాట చెప్పిన 24 గంటల్లో మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన బృందం కూల్చివేసిన షెడ్ల శిథిలాలను తొలగించింది. పునర్ నిర్మాణ పనులు ఆరంభించింది.. ఏదేమైనా ఈ విషయంలో లోకేష్ స్పందించిన తీరుకు ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.