తెలంగాణ రాజకీయాలు నిత్యం సరికొత్త మలుపులు తిరుగుతూ దేశ రాజకీయ పరిశీలకుల దృష్టిని సైతం ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ఒక సంచలనంగా మారుతోంది. కొన్ని నిర్ణయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తే, మరికొన్ని షాక్ ఇస్తున్నాయి. ఇంకొన్ని నిర్ణయాలు మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చలకు దారితీస్తున్నాయి.

ఇలాంటి క్రమంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. రాజకీయ వర్గాల్లో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవిని సున్నితంగా తిరస్కరించిన విజయశాంతి, కాంగ్రెస్ పిలుపు మేరకు పార్టీలోకి రావడం, ఇప్పుడు ఎమ్మెల్సీ పొందడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని పార్టీ శ్రేణులు చెబుతున్నప్పటికీ, అసలు కథ ఇప్పుడే మొదలైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

విజయశాంతి ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒకటే హడావుడి. ఆమెకు హోం మంత్రి పదవి ఖాయమంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి చక్రం తిప్పేశారని, అధిష్టానం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు గుప్పుమంటున్నాయి. మంత్రివర్గంలో ఇంకా కొన్ని ఖాళీలు ఉండటంతో, వాటిలో విజయశాంతికే హోం శాఖ దక్కుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.

అయితే, విజయశాంతికి మంత్రి పదవి ఇస్తే కొత్త పవర్ సెంటర్ పుట్టుకొస్తుందని కొందరు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె అద్భుతాలు చేయకపోవచ్చు కానీ, ప్రజల్లో ఆమెకున్న గుర్తింపు, ఫెమిలియారిటీ రేవంత్ రెడ్డికి బాగా కలిసొచ్చే అంశం. రేవంత్ రెడ్డికి తనను మించిన ఫెమిలియర్ ఫేస్ మరొకరు ఉండటం ఇష్టం ఉండకపోవచ్చు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క వంటి సీనియర్లు ఉన్నా, విజయశాంతి క్రేజ్ వేరు. అటెన్షన్ సీకర్ అయిన రేవంత్ రెడ్డి, అంతే అటెన్షన్ కోరుకునే విజయశాంతిని ఎలా డీల్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. చూడాలి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: