గోషామహల్ బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈయన మరోసారి సొంతపార్టీ నేతలపైన ఆరోపణలు చేశారు. తాజాగా ఈ విషయంపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. కానీ బీజేపీ అధికారంలోకి రావాలంటే.. కొంత మంది బీజేపీ నేతలను పార్టీ నుండి బయటికి పంపించాలని అన్నారు. అలా వాళ్లు వెళ్లిపోయినప్పుడే బీజేపీ గెలుపు సాధ్యం అవుతుందని తెలిపారు. కొంత మంది సొంతపార్టీ నేతలే పార్టీకి ద్రోహం చేస్తున్నారని బీజేపీ నేత రాజాసింగ్ ఆరోపణలు చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీజేపీ నేతలు సీక్రెట్ గా సమావేశం అవుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. మరి కొంతమంది నేతలు పార్టీ వాళ్లదే అన్నట్లు ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. అలా భావించే వారందరూ కొన్ని సామాజిక వర్గాలకు చెందిన నేతలు అని, వారిని ఇంటికి పంపిస్తేనే బీజేపీ బాగుపడుతుందని రాసుకొచ్చారు. బీజేపీ పార్టీకి మంచి రోజులు రావాలంటే కచ్చితంగా ఇది అమలు చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పుకొచ్చారు. ఈ విషయంపై భారత జనతా పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని లేఖలో రాజాసింగ్ కోరారు.

అలాగే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచాక ఎవరెవరు బీజేపీ నేతలు, కాంగ్రెస్ పార్టీతో నిత్య టచ్ లో ఉంటున్నారనేది కూడా ఆయనకు తెలుసని చెప్పారు. వారందరి గురించి త్వరలోనే బీజేపీ అధిష్టానానికి తెలిసేలా చేస్తానని స్పష్టం చేశారు. ఇక ఈ లేఖ ప్రస్తుతం రాజకీయ వర్గాలలో చర్చలకు దారితీసింది. మరి దీనిపైన అధిష్టానం ఆ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం రేవంత్ రెడ్డిపైన కూడా మండిపడ్డారు. హోలీ పండుగను ఎలా జరుపుకోవాలనేది హిందువులకు రేవంత్ చెప్పాల్సిన పనిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన కాదు.. నిజాం పరిపాలన సాగుతుందని దుయ్యబట్టారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: