
చంద్రబాబు నాయుడు వంటి నాయకుడిని జైల్లో పెట్టిన తర్వాత తన పైన వైసిపి ప్రభుత్వం చాలానే కుట్రలు చేశారంటూ తెలియజేశారు.. అసెంబ్లీ గేటు కూడా తాకలేవని చాలామంది తనని ఎద్దేవ చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికలలో 100% స్ట్రైక్ రేట్ తో గెలిపించిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏపీలో నిలబెట్టాను అంటూ తెలియజేశారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కూటమిలో ఏపీ అంతట పెను దుమారని సృష్టిస్తున్నాయి. నాలుగు దశాబ్దాలుగా ఉన్న టిడిపిని నిలబెట్టానని పవన్ కళ్యాణ్ అనడంతో టిడిపి మద్దతుదారులు కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని తప్పు పడుతున్నారు.
మీరు ఏది చెబితే అది నమ్మడానికి జనాలు ఏమి పిచ్చోళ్ళు కాదు అంటూ కూడా చాలామంది విమర్శిస్తూ ఉన్నారు.. అయితే తమ నేత కూటమి ఏర్పాటు ప్రతిపాదనలు వల్లే కూటమి గా అధికారంలోకి వచ్చారు అంటూ జనసైనికులు కూడా పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ కౌంటర్లు వేస్తూ ఉన్నారు. అలాగే నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూడా అటు టిడిపి నేతలు ఆగ్రహానికి తీసుకువచ్చేలా ఉన్నాయి. మరి ఏ మేరకు ఇలాంటి వ్యాఖ్యలు అన్నీ కూడా కూటమినేతలు పట్టించుకోకుండా కలిసికట్టుగానే ముందుకు వెళ్తారేమో చూడాలి.