ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ... క్రమ క్రమంగా బలపడుతోంది. అధికారంలోకి రావడానికి దాదాపు పది సంవత్సరాలు పవన్ కళ్యాణ్ కష్టపడ్డారు. ఈ సంవత్సరంలోనే తాజాగా జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా తన పార్టీ ప్రస్థానం, సాధించిన విజయాలు అలాగే వైసిపి పార్టీ పైన పోరాటం లాంటి అంశాలను ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. తన 11 సంవత్సరాల ప్రయాణంలో వైసిపి పార్టీని 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేసినట్లు గుర్తు చేశారు.


2014 సంవత్సరంలో జనసేన పార్టీ పెట్టి ఒంటరి ప్రయాణం మొదలుపెట్టినట్లు గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. ఈ తరుణంలోనే ఈ స్థాయికి వచ్చినట్లు తెలిపారు. ఏపీ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అంటూ.. వైసిపి నేతలు అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటిది అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకొని 100% స్ట్రైక్ రేటు సంపాదించినట్లు... జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గత ఐదు సంవత్సరాలుగా ఏపీలో హింసను సాగించాలని ఫైర్ అయ్యారు.


ప్రతిపక్షాలను వేధించారని కూడా... మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నన్ను వైసిపి నేతలు తిట్టిన తిట్టు లేదని కూడా గుర్తు చేసుకున్నారు. భావ తీవ్రత ఉంది కాబట్టి పోరాట యాత్ర చేశామని స్పష్టం చేశారు. ఓటమి భయం... లేదంటూ వ్యాఖ్యానించారు. అందుకే 2019 ఎన్నికల్లో పోటీ చేసినట్లు గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. తాను కూడా రెండు స్థానాల్లో ఓడిపోయినట్లు కూడా గుర్తు చేశారు. అయినప్పటికీ ఎక్కడ తగ్గలేదు అన్నారు.


అందుకే ఈసారి గొప్ప విజయాన్ని జనసేన అందుకుందన్నారు. మనం నిలబడ్డాం అలాగే పార్టీని కూడా నిలబెట్టినట్లు స్పష్టం చేశారు. మనం నిలదొక్కుకోవడమే కాకుండా నాలుగు దశాబ్దాల టిడిపి పార్టీని కూడా నిలబెట్టినట్లు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మనం ఓడిపోయినప్పుడు మీసాలు మెలేశారు అలాగే జబ్బలు చరిచారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. జనసేన జన్మస్థలం తెలంగాణ అలాగే కర్మ స్థలం ఆంధ్ర అయిందంటూ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: