- ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) . . .

జ‌నసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం స‌భ‌లో ప‌వ‌ర్ ఫుల్ స్పీచ్‌తో కుమ్మి ప‌డేశాడు. ఈ స‌భ‌లో ప‌వ‌న్ మాట్లాడుతూ భయం లేదు...‌ భయం లేదు .. చేతిలో దీపం లేదు అయినా భయం లేదు.. కానీ ఒక్కడినే జనసేన పార్టీ స్థాపించా.. 2018లో పోరాట యాత్ర చేశాను.. భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశారు. ఓడినా అడుగు ముందుకు వేశాను.. మనం నెల తొక్కుకున్నాం.. తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టాం.. మనం ఓడినప్పుడు తొడలు గొట్టాలు. మన ఆడపడుచులను అవమానించారు... వారిని జైళ్ళల్లో పెట్టారు నిర్బంధించారు . . నాలుగు దశాబ్దాలుగా సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని జైల్లో పెట్టారు .. నాలాంటి వాడిని ఎన్నో అవమానాలు చేశారు.‌ నన్ను అసెంబ్లీని గేటు తాక‌నీయ‌ను అన్నారు..
అసెంబ్లీ గేటును బద్దలు 21 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీ అడుగుపెట్టాం అని ప‌వ‌న్ గ‌ర్వంగా తెలిపారు.


దేశమంతా తలతిప్పి చూసేలా మనం వైపు విజయం సాధించాం.. రుద్రవీణ వాయిస్తా.‌....  అగ్ని ధారలు కురిపిస్తా.. దాస్తిక ప్రభుత్వాన్ని దింపి కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాను.. నా తెలంగాణ..  కోటి రతనాల వీణ.. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం నాకు పునర్జనములు ఇచ్చింది .. నా అన్న గద్దర్ అన్న జన్మభూమి నుంచి వచ్చిన తెలంగాణ సభ్యులందరికీ ధన్యవాదాలు .. రెండు రాష్ట్రాల ఆడపడుచులు, నా వీర మహిళలకు నేను రుణపడి ఉంటాను అని రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల మ‌న‌స్సుల‌ను గెలుచుకున్నారు.


మన జై కేతనం ఎగురవేసిన వేళ హోలీ పండుగ రావడం. యాదృచ్ఛికం కాదు.  భగవంతుడు నిర్ణయం అని .. తమిళ నాడు ప్రజలు ప్రజలు నాకెంతో ప్రేమను ఇచ్చారు. అందరికీ నమస్కారం .. మహారాష్ట్ర ప్రజలు నాకు సినిమా అభిమానులు అనుకున్నాను. కానీ నాకు రాజకీయ అభిమానులు అని తెలిసింది .. మహారాష్ట్ర అంటే చత్రపతి సంభాజీ పుట్టిన నేల .. .. కర్ణాటక నుంచి వచ్చిన ప్రతి జన సైనికునికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాన‌ని ప‌వ‌న్ తెలిపారు.


బహుభాషా పరిజ్ఞానం భారతదేశంలో అందరికీ  మంచిది అని .. మనం రాజకీయాలు మాట్లాడుతున్నప్పుడు సినిమాలు జోలికి వెళ్ళకూడదు .. చాలామంది కార్యకర్తలు సినిమాలు కాకుండా రాజకీయ సిద్ధాంతాల కోసం ప్రాణం విడిచారు .. 11 సంవత్సరాల పాటు పార్టీని నడిపినప్పుడు ఆ కష్టాలు ఏమిటో మీకు చెబుతాన‌న్న ప‌వ‌న్ నా కష్టాలు మీకు తప్ప ఎవరికి చెప్పుకుంటాను. ..? మా అమ్మకి.... నాన్నకి...  నేను ఎప్పుడో చెప్పాను నేను రాజకీయాల్లోకి వెళ్తాను అని.. సినిమా నాకు జీవితం కాదని అప్పట్లో వాళ్ళకి చెప్పలేకపోయాను.. గద్దర్ గారు .. నన్ను ఎప్పటినుంచో అభిమానించేవారు.. నన్ను రాజకీయాల్లోకి ప్రోత్సహించింది శ్రీపతి రాముడు గారు... ఆయన రాజకీయ నాయకుడు కాదు. అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తున్న వ్యక్తి అని ప‌వ‌న్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: