ప్రస్తుతం దేశవ్యాప్తంగా
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్
కళ్యాణ్ జయకేతనం సభలో మాట్లాడిన మాటలే వైరల్ గా మారుతున్నాయి. ఈయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ నేపథ్యంలోనే
హిందీ భాషని పొగుడుతూ
హిందీ భాషను వ్యతిరేకించద్దు అంటూ మాట్లాడి తమిళనాడుపై పైరయ్యారు.కానీ
హిందీ భాష గురించి మాట్లాడి వివాదంలో ఇరుక్కున్నారు పవన్ కళ్యాణ్. ఆరోజు అలా మాట్లాడి ఇప్పుడు ఇలా మాట్లాడతారా అంటూ డిప్యూటీ సీఎం పవన్
కళ్యాణ్ ని సోషల్
మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు నెటిజన్స్.అయితే గతంలో చేసిన ఎన్నో పోస్టులకు సంబంధించి వెతికి మరీ వాటిని బయట పెడుతూ మళ్లీ అలా మాట్లాడిన వారిని వివాదాల్లో పడేస్తూ ఉంటారు సోషల్
మీడియా జనాలు.
అలా పవన్
కళ్యాణ్ హిందీ భాష గురించి మాట్లాడిన మాటలపై అప్పుడు అలా మాట్లాడి ఇప్పుడు ఇలా మాట్లాడుతారా అంటూ
వైసీపీ శ్రేణులు అప్పట్లో పవన్
కళ్యాణ్ చేసిన ట్వీట్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పవన్
కళ్యాణ్ ని ఏకిపారేస్తున్నారు. ఇక ఇంతకీ విషయం ఏమిటంటే.. పవన్
కళ్యాణ్ హిందీ భాషను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని, దేశం ధర్మం అంతా ఒక్కటేనని, తమిళనాడు ప్రజలు హిందీని వ్యతిరేకిస్తూ హిందీలో తమ సినిమాలను మాత్రం డబ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు.డబ్బులు కావాలంటే నార్త్ వాళ్ళు పనికి వస్తారు. కానీ భాషను మాత్రం పక్కన పెడతారా అంటూ తమిళనాడు పై ఫైర్ అయ్యారు అంతేకాకుండా దేశంలో ఉన్న అన్ని భాషలు సమానమే అని
హిందీ భాషను వ్యతిరేకించడం ఇకనైనా ఆపండి అంటూ డిప్యూటీ సీఎం పవన్
కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈయన వ్యాఖ్యలపై
వైసీపీ శ్రేణులు పవన్
కళ్యాణ్ గతంలో చేసిన ఒక పోస్ట్ ని వైరల్ చేస్తున్నారు.ఇక ఆ పోస్టుల్లో ఏముందంటే.. పవన్
కళ్యాణ్ హిందీ భాషను వ్యతిరేకిస్తూ
హిందీ గో బ్యాక్ అంటూ పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ని పోస్ట్ చేస్తూ ఉత్తర భారత దేశంలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా మన దేశ
సంస్కృతి సాంప్రదాయాలను సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకొని అందర్నీ గౌరవించాలి అంటూ ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశారు.అయితే ఈ ట్వీట్ ని వెతికి మరీ
వైసీపీ శ్రేణులు తమ ఖాతాలో వైరల్ చేస్తున్నారు.అప్పుడు
హిందీ భాషకు సంబంధించి గో బ్యాక్ అని ట్వీట్లు పెట్టి ఇప్పుడేమో
హిందీ భాష గురించి మాట మార్చేస్తావా.. అప్పుడేమో అలా మాట్లాడి ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావా.. అంటూ పవన్
కళ్యాణ్ ని ఏకిపారేస్తున్నారు.
హిందీ మన భాష అని ఇప్పుడు అంటున్నావ్ మరి అప్పుడే ఏమైంది అంటూ పవన్ పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు