
ఇక పదవ తరగతి పరీక్షలు జరిగే పాఠశాలలో మాత్రం ఆ పరీక్షలు ముగిసే వరకు మధ్యాహ్నం నుంచి 1:15 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని అధికారులు తెలియజేయడం జరిగింది. ఈనెల 17వ తేదీ నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగబోతున్నాయి. ఈ తరుణంలోనే విద్యార్థులకు సంబంధించి అన్ని అవసరాలకు కూడా ఏపీ ప్రభుత్వం సదుపాయాలను ఉంచేలా చూస్తోందట. అయితే ఈసారి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు జరగబోతున్నాయట. 134 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
జిల్లావ్యాప్తంగా పదవ తరగతి పరీక్షల విద్యార్థులు 25,723 మంది హాజరు కాబోతున్నారని పరీక్షలకు ఎటువంటి ఆటంకాలు కలవకుండా ఉండేందుకు చాలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది అన్ని జిల్లాలలో కూడా ఇదే పద్ధతిని అనుసరించేలా చేస్తోంది ఏపీ ప్రభుత్వం. అలాగే ఎంతోమంది ఇన్సులేటర్లతో పాటుగా స్క్వాడ్ బృందాలను కూడా ప్రత్యేకించి మరి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా విద్యార్థులకు మాత్రం ఒంటిపూట బడుల విషయంలో ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. ఇక సెలవులు ఎప్పుడు అన్న విషయం పైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నది. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయబోతున్నారు.