- ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) . . .

పిఠాపురం జ‌నసేన ఆవిర్భావ స‌భ సాక్షిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట‌ల తూటాలు పేల్చారు. ప‌వ‌న్ నోటి నుంచి వ‌చ్చిన‌వి మాట‌లా ?  తూటాలా అన్న‌ట్టుగా ఆయ‌న మాట‌లు .. పంచ్‌లు పేలాయి. ఇక ఈ సభను విజయవంతం చేయడానికి ముఖ్య కారకులు పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పిన ప‌వ‌న్ తాను తీసుకున్న నిర్ణయాలకు లాభనష్టాలు.. భరించిన హరిప్రసాద్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రభాస్, మహేష్, రామ్ చరణ్, మెగాస్టార్, అభిమానులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నేతలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పి అంద‌రి మ‌న‌స్సుల‌ను గెలుచుకున్నారు.


మన పార్టీ 11 సంవత్సరం పూర్తి చేసుకుంది. వాళ్లని అంటే వైసిపిని 11 కి పరిమితం చేసాం అంటూ అదిరిపోయే సెటైర్ వేశారు. పోలీసు శాఖ అంటే నాకు చాలా గౌరవం. పోలీస్ శాఖ పై వ్యక్తిగతంగా నాకు ఎటువంటి కోపం ఉండదని ... ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన డిజిపి గారికి కాకినాడ ఎస్పీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అని ప‌వ‌న్ తెలిపారు. చంటి సినిమాలో హీరోయిన్ లాగా నన్ను మా కుటుంబ సభ్యులు పెంచారు అన్న ప‌వ‌న్ నేను పెద్ద హీరోను అయిన  తర్వాత కూడా మా నాన్న నన్ను తిట్టేవారు నాటి సంగ‌తులు గుర్తు చేసుకున్నారు. నెల్లూరులో నేను సామాన్యుడిలా కూరగాయలు కొనేవాడిని అని ... కోట్లాదిమందిని ప్రభావితం చేసే రాజకీయాలు సినిమాలు నన్ను చాలా ప్రభావితం చేశాయ‌ని ప‌వ‌న్ తెలిపారు. మనుషులం శాశ్వతం కాదు ..అది మంచైనా... చెడైనా..? మన సిద్ధాంతాలు చాలా మదింవి ..శోధించి చేసినవి.. నేను చాలా కష్టపడి చేశాన‌ని ప‌వ‌న్ తెలిపారు.  


చేగువీరలో ఆయన మనవీయ కోణం ఇష్టపడి ఆయనను అభిమానించాను ... భిన్నమైన వ్యక్తుల్లో ఏకత్వం చూడడమే పవన్ కళ్యాణ్ నైజం అని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. నేను జ్ఞానాన్ని సంపాదించడం  కోసం చెయ్యని ప్రయత్నం లేవు .. ఓ దశాబ్దం పాటు పార్టీని నడిపించాలంటే ఎన్ని అవమానాలు  భరించాలి. కానీ నేను భరించాను.. ఇది నా నేల ... నేను భరిస్తాను .. మార్పు చాలా సహజం.. అది ఎగడానికైనా ...? దిగ జరగడానికేనా...? ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బులు లేని వారి దగ్గర ఎన్ని వేలకోట్లు ఎలా వచ్చాయి. ..?
సనాతన ధర్మం హిందూ ధర్మ పరిరక్షణ అనే విషయాలపై తొందరలో మాట్లాడతాను.. 4000 పైచిలకు గిరిజన గ్రామాలకు గ్రామాలకు రోడ్లు వేయించాము.‌. నాకు దేశం కోసం నిలబడే యువత కావాలి... గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ కోసం ఆలోచిస్తున్నారు అని తెలిపారు.


నాకు 14 ఏళ్ల వయసు నుంచి కూడా సనాతన ధర్మం కోసం పోరాడాను.. మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రామనామం జపం ఉండేది .. ఒక హిందువు ముస్లిం పట్ల తప్పుగా ప్రవర్తిస్తే తప్పనే చెప్తాను .. అల్లా కి ఒక న్యాయం ..జీసస్ కి ఒక న్యాయం ..హిందువు కి ఒక న్యాయం అంటే నేను ఒప్పుకోను... నేను చిరంజీవికి ..అమితాబ్ కి ఫ్యాన్ ని.‌ కానీ అంతకంటే ముందు దేశానికి అభిమానిని .. అల్లాను ద్వేషించమని సనాతన ధర్మం చెప్పలేదు ... తప్పు చేస్తే హిందువునైనా.... ముస్లిం నైనా ...క్రైస్తవులైన శిక్షించాల్సిందే అని ప‌వ‌న్ తెలిపారు. చివ‌ర‌గా జ‌న సైనికులు అంద‌రూ క్షేమంగా ఇంటికి వెళ్లాల‌ని ప‌వ‌న్ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: