ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిపై జనసేన నాయకులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఆస్తులు మొత్తం కాజేశాడని జగన్‌ మోహన్‌ రెడ్డిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు జనసేన నాయకులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సమావేశాల నేపథ్యంలో... జనసేన నాయకులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీని టార్గెట్‌ చేశారు బాలినేని.

జనసేన ఎమ్మెల్యేలు.... కార్యకర్తలను పట్టించుకోవడం లేదని బాంబ్‌ పేల్చారు.  తర్వాత ఇబ్బంది రాకుండా ఇప్పుడే సీఎం, డిప్యూటీ సీఎం కార్యకర్తలపై దృష్టి పెట్టాలని కోరారు జనసేన నాయకులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి.  పవన్ తో సినిమా తీయాలని ఉంది..నేను అదే చెప్పాను..తీస్తానని మాట ఇచ్చారన్నారు.  అరెస్ట్ చేయాల్సింది కార్యకర్తలను కాదని కోరారు. స్కామ్ లు, కోట్లు సంపాదించిన వారిని అరెస్ట్ చేయడం లేదు అదే నా బాధ అంటూ వైసీపీ నేతలకు ఎసరు పెట్టాడు.


నాకు రాజకీయ భిక్ష పెట్టింది వై ఎస్ రాజశేఖర్‌ రెడ్డి అంటూ వ్యాఖ్యనించారు. జగన్ పార్టీ పెడితే మంత్రి పదవి వదులుకుని వెళ్ళాను అంటూ గుర్తు చేశారు జనసేన నాయకులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి. మంత్రి పదవి  నాకు డోంట్ కేర్ అన్నారు. పోసాని ని అరెస్ట్ చేస్తే జగన్ వెళ్లి పరామర్శిస్తాడు.... చేసిన దుర్మార్గాలు ఊరికే పోవని చురకలు అంటించారు. నా ఆస్తులు, నా వియ్యంకుడి ఆస్తులు కూడా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి కాజేశాడని  ఆరోపణలు చేశారు.  కూటమి ప్రభుత్వం లో కొన్ని ఇబ్బందులు, కష్టాలు ఉంటాయన్నారు. క్షేత్ర స్థాయి లో చిన్న చిన్న విషయాలలో గొడవలు పడొద్దని కోరారు. మూడు పార్టీలు కలిసి మెలిసి పని చేయాలని వెల్లడించారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: