- ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) . . .

తెలుగు రాష్ట్రాల పవర్ స్టార్ అలాగే జ‌న‌సేన అధినేత .. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కెరీర్ ప‌రంగా పీక్ స్టేజ్ లో ఉన్నాడు. ప‌వ‌న్ అంటే ఓ మానియా .. ప‌వ‌న్ అంటే ఓ పిచ్చి .. ప‌వ‌న్ కు ఉన్న క్రేజ్ అలాంటిది ఇలాంటిది కాదు ... ప‌వ‌న్ పేరు చెపితే తెలుగు యువ‌త .. తెలుగు సినీ ప్రేమికులు ఉర్రూత‌లూగి పోతున్నారు. ప‌వ‌న్ తాజాగా త‌న జ‌న‌సేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా తన నియోజకవర్గం అయిన పిఠాపురం పరిధిలోని చాలా ఘ‌నంగా నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. రెండు తెలుగు రాస్ట్రాల దారులు అన్నీ పిఠాపురం వైపే గ‌త రెండు రోజులుగా న‌డిచాయి. ఈ సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం అంతా ఓ రేంజ్ లో ఎదురు చూడగా ఈ స్పీచ్ పై ప‌వ‌న్ అన్న మెగాస్టార్ చిరంజీవి సోద‌రుడు షాకింగ్‌ సర్ప్రైజింగ్ రెస్పాన్స్ ఇవ్వ‌డం మెగా అభిమానులుకి మరింత ఉత్సాహం ఇచ్చింద‌ని చెప్పాలి.


పవన్ మాట్లాడుతున్నంత సేపు అక్క‌డ గ్రౌండ్ లో ఉన్న ల‌క్ష‌లాది మంది జ‌నం తో పాటు టీవీ ల్లో దేశ , విదేశాల్లో చూస్తోన్న తెలుగు ప్ర‌జ‌లు అంద‌రూ మై మ‌రిచి పోయి మ‌రి అలా ఆ ప్ర‌సంగానికి అతుక్కు పోయారు. ప‌వ‌న్ ఇక స్పీచ్ ఇలా అయ్యిందో లేదో చిరు తన ఎక్స్ ఖాతా నుంచి వదిలిన పోస్ట్ వైరల్ గా మారింది. “ మై డియర్ బ్రదర్ పవన్ కళ్యాణ్ జనసేన జయకేతన సభలో నీ స్పీచ్ కి మంత్రముగ్ధుడిని అయ్యాను ... అక్క‌డ సభ కొచ్చిన అశేష జన సంద్రం లానే నా మనసు ఉప్పొగింది అని... ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింద‌ని చిరు కొనియాడారు .. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తి తో నీ జైత్రయాత్ర నిర్విఘంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాన‌ని ఇరు ప‌వ‌న్ ను ఆశీర్వ‌దించారు. ఇక జన సైనికులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు” అంటూ చేసిన ఈ పోస్ట్ ఇపుడు మెగా, ప‌వ‌న్‌ అభిమానుల్లో పట్టరాని ఆనందం నింపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: