
పవన్ కామెంట్ల గురించి టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుందని సమాచారం అందుతోంది. ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న టీడీపీని తాను నిలబెట్టాననే విధంగా పవన్ కళ్యాణ్ కామెంట్లు చేయడం గురించి కూటమి శ్రేణులు ఫైర్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ల గురించి టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు సైతం ఫైర్ అవుతుండటం గమనార్హం.
మెగా బ్రదర్స్ అధికారంలో లేని సమయంలో ఒక విధంగా అధికారం ఉన్న సమయంలో మరో విధంగా వ్యవహరించడం సరి కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్, నాగబాబు ఎన్నికల్లో వచ్చిన గెలుపును చూసి ఎక్కువగా ఊహించుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్, నాగబాబు సినిమాలకు దాదాపుగా దూరమైనట్టేనని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
పవన్, నాగబాబు భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. గోదావరి జిల్లాల్లో పవన్, నాగబాబులకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. పవన్ సినిమాల్లో నటిస్తే 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వడానికి సైతం సిద్ధంగా ఉన్నారు. అయితే పవన్ మాత్రం సినిమాల్లో నటించే ఛాన్స్ అయితే లేదని చెప్పవచ్చు. నాగబాబు ఎమ్మెల్సీ పదవి వస్తున్న తరుణంలో అనవసర వ్యాఖ్యలు మంచివి కావని చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి మాత్రం రాజకీయాలకు పూర్తిస్థాయిలో దూరంగా ఉన్నారు. భవిష్యత్తులో చిరంజీవి రాజకీయాలపై ఫోకస్ పెట్టే ఛాన్స్ అయితే లేదని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు,.