
అయితే ఈ విషయం ఇలా ఉంచితే అసలు పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న సిచువేషన్ లో సినిమా చేయటం అనేది అసలు దాదాపు అసాధ్యం . ప్రజెంట్ పూర్తి చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి .. వాటికి రెండు మూడు రోజులు కేటాయించడం కూడా కష్టంగా మారిపోతుంది .. ఎప్పటికప్పుడు ఆ సినిమాలు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు .. హరిహర వీరమల్లు , ఓజి , ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలు లైన్లో ఉన్నాయి .. ఇప్పటికే వీరమల్లు సెకండ్ పార్ట్ కూడా ఉంది .. వీటి షూటింగ్లకు డేట్లు కేటాయించడమే గొప్ప విషయంగా పవన్ కు మారిపోయింది ..
ఈ సమయంలో కొత్త సినిమా అంటే దాదాపు అది కుదిరే పని కాదు ..ఇక పవన్ తో సినిమా తీసి జగన్ కాజేసిన తన ఆస్తులను మళ్ళీ తను సంపాదించుకోవాలని బాలినేని భావిస్తున్నారు .. ఆర్థిక కష్టాల నుంచి పవనే బయటి పడేయాలని ఆయన కోరుకుంటున్నారు . అయితే పవన్ కు మాత్రం అంత తీరికా ఉందా అనే అనుమానాలు ప్రశ్న కూడా వస్తుంది .. బాలినేని ఎట్టి పరిస్థితులను సినిమా చేయాలని పవన్ అనుకుంటే దానికి మరో నాలుగైదు సంవత్సరాల సమయం పెట్టి అవకాశం ఉంది . ఇక మరి పవన్ బాలనేని కోరిక నెరవేరుస్తారో లేదో అనేది చూడాలి.