11 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్తానాన్ని పూర్తి చేసుకున్న జనసేన పార్టీ 12 ఆవిర్భావ దినోత్సవం ఎంతో రంగా రంగా వైభవంగా జరిగింది .. ఎప్పుడు జనసేన సభల‌లు , ఆవిర్భావాలు జరిగిన అభిమానులను సృష్టించే గందరగోళంతో పవన్ కళ్యాణ్ ఆవేశపూరిత ప్రసంగాలతో సాగేవి .. అయితే ఈసారి మాత్రం ఎంతో ప్రణాళిక బద్ధంగా సభ పకడ్బందీగా నిర్వహించారు .. అయితే పవన్ కళ్యాణ్ స్పీచ్ లో ఎలాంటి మార్పులు లేకపోవడం పార్టీ పెట్టినప్పటి నుంచి చెబుతున్న మాటలే చెప్పడం తో భవిష్యత్తు పై దిశా నిర్దేశం ఏది అన్న సందేహం  కిందిస్థాయి సాధారణ జనసేన కార్యకర్తల్లో కలుగుతుంది.


ఇక పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు తను ఎందుకు పార్టీ పెట్టానో కూడా చెప్పారు .. అలాగే గత 11 సంవత్సరాలుగా అదే చెబుతూ వస్తున్నారు .. తన కుటుంబంలో త‌న‌తు ఎలా చూశారో .. తన సినిమాలు ఇలా ఆయనకు సంబంధించిన ఎన్నో కబుర్లు ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు .. అలాగే తనకు పార్టీ పెట్టి అర్హత ఉందన్నారు ... ఇలా ఇవన్నీ ఆయన్ను ఎవరు అడగలేదు . పార్టీని పెట్టారు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఎదిగారు . అలా ప్లీనరీ వేదికగా పార్టీ సిద్ధాంతాలను విధివిధానాలను కార్యకర్తలకు వివరించాలి .. కానీ ప్రసంగం మొత్తం తన జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించినట్టుగా మారింది.


అలాగే జనసేన సభ వేదికపై చాలామంది అనుభవాలను ప్రసంగించారు .. ఎమ్మెల్యేలు , ఎంపీలు అందరికీ అవకాశం ఇచ్చారు .. అలాగే బాలినేని లాంటి కొత్తగా పార్టీలో చేరిన వారికి కూడా మాట్లాడే అవకాశం ఇచ్చారు .. ఒక్కరు ఇప్పటివరకు సాధించింది ఓకే .. ఇక ముందు ముందు ఎలా ముందుకు వెళ్లాలని దానిపై చర్చలు జరగలేదు .. పవన్ కళ్యాణ్ మహనీయుడు అనే దగ్గర నుంచి తాము పిఠాపురం తాలూకా అనే చెప్పేదాకా ఆయనను ఆకాశానికి ఎత్తేశారు .. నాగబాబు అయితే ముఖ్యంగా మరిన్ని పొగడ్తలతో ముంచేశారు . ఇక పార్టీ నాయకులకు అధినేత గొప్పే కాని ప్లీనరీలో దిశానిర్దేశం అనేది మొదటి అంశంగా ఉండాలి .  


ఇక పిఠాపురంలో పవన్ విజయం ఎవరివల్ల వచ్చిందనుకుంటే అది వారి కర్మ అని . ఓటర్లే గెలిపించాలని నాగబాబు చెప్పుకొచ్చారు .. ఇప్పుడు టిడిపిని తామే  నిలబెట్టామని చెప్పుకున్న పవన్ కు ఇది వర్తిస్తుందా అనేది ఎక్కువమందికి వస్తున్న కొత్త డౌట్ .. కూటమిగా పార్టీలు పోటి చేశాయి ఎవరు ఎవరిని నిలబెట్టారు అన్ని పార్టీలు కలిసికట్టుగా నిలబడి పోటీ చేశాయి .. ఆస్ఫూర్తిని మాత్రం కొనసాగిస్తామన్న సందేశాన్ని పవన్ ఇవ్వలేకపోయారు .. జనసేన ఆవిర్భావ సభ తర్వాత కూటమి  పార్టీ నాయకుల్లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: