
ఇక ఈ నారం చేయించిన వాడే సాక్షులను ఒక్కొక్కరుగా తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నది .. క్రిమినల్ లో ఎవరు అందరికీ తెలిసిన విషయమే . ఎవరో దొంగతనం చేస్తే వారిని కాపాడేందుకు వేరే వాళ్ళు సాక్షులు తుడు చేయరు కదా.. అలా చేస్తే వాడు కూడా సూత్రధారి అవుతారు .. ఎప్పుడు వివేకా కేసులో ఏం జరుగుతుంది .. హార్ట్ ఎటాక్ తో చనిపోయారని ప్రచారం చేశారు .. నరికేసిన గాయాలు కనిపించకుండా కట్లువేశారు రక్తం తుడిచేసారు పోస్టుమార్టం వద్దన్నారు కేసు కూడా వద్దన్నారు . అసలు పోలీసులే రావొద్దు అన్నారు .. చివరకు వివేక కుమార్తె పట్టుబట్టడంతో పోస్టుమార్టం చేశారు .. అప్పుడు అసలు నిజం బయటపడింది దొరికిపోయిన దొంగలు రాజకీయం చేయటం మొదలుపెట్టారు.
ఎంత సింపుల్ కేసో కానిస్టేబుల్ గా పదేళ్ల సర్వీస్ లో ఉన్న వ్యక్తికి తెలుసు .. ఎందుకంటే ఈ కేసు కానిస్టేబుల్ సాల్వ్ చేయగలడు .. ఆరు సంవత్సరాలు అయింది మరి ఎందుకు ఈ కేసు ఇప్పటికీ పూర్తి కావడం లేదు .. వివేక సోంత అన్న కొడుకు సీఎం అయ్యాడు .. ఐదేళ్లు ఉన్నారు చంద్రబాబు ఆయన్ను చేయించారని ఆరోపణలు చేశారు .. కానీ విచారణ మాత్రం ముందుకు వెళ్ళలేదు .. చివరికి కోర్టు సిబిఐకి ఇచ్చింది .. ఆ సిబిఐ పైన కూడా కేసులు పెట్టించారు. చివరికి వివేక కూతురు పైన కూడా నిందలు వేస్తున్నారు . ఇప్పటికీ ఈ కేసు కోర్టులో నలుగుతూనే ఉంది .. వివేక అన్న కుమారుడు కాలం చెల్లిపోయింది అయినా మార్పు ఎక్కడ కనిపించడం లేదు .
అవినీతి కేసుల గురించి ఏమో కానీ ఇలా మనుషుల్ని అడ్డగోలుగా చంపిన కేసుల్లో వ్యవస్థలు ఫెయిల్ అయితే సామాన్లకు న్యాయం జరుగుటం కష్టమే .. అసలైన నిందితులు ప్రజలు ఇచ్చిన అధికారంతో తమను తాము కాపాడుకుంటున్నారు .. ఇప్పుడు ప్రజలు వారికి ఆ రక్షణ తీసేశారు ఇప్పుడైనా వారికి శిక్ష పడుతుందా . వివేక హత్య కేసు నిందితులకు సూత్రధారులకు శిక్ష పడితేనే ప్రజలకు చట్టం గెలిచినట్టు న్యాయంపై గౌరవం పెరుగుతుంది . లేకపోతే ఈ అరాచకాలకు మరింత బలం పెరిగిపోతుంది .. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు , పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో వివేకా కేసుపై ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలి.