తమిళనాడులో మద్యం పాలసీలో స్కేం జరిగిందని ఈడి దాడులు చేసింది .. గత మూడు నాలుగు రోజుల పాటు అక్కడ స్వాధలు చేసి 1000 కోట్ల స్కేమ్ జరిగిందని .. ఒక్కొక్క లిక్కర్ బాటిల్ కు 10 నుంచి 20 రూపాయల చొప్పున వసూలు చేశారని ఈడి గుర్తించంది ..  ఇక‌ ఆ డబ్బు రాజకీయ నేతలకు చేరిందన్న అనుమానాలు కూడా ఈడి వ్యక్తం చేసింది .. అయితే ఇప్పుడు తర్వాత టార్గెట్ ఎలా ఉంటుందో  చెప్పకనే చెప్పేసింది .. అయితే ఇంత హడావుడి చేస్తున్న ఈడీ కి ఏపీ లో అత్యంత అరాచకంగా సాగిన మద్యం పాలసీ స్కామును ఎందుకు పట్టించుకోవటం లేదన్న ప్రశ్న కూడా వస్తుంది ..


 సీఎం చంద్రబాబు చాలా రోజుల క్రితమే అసెంబ్లీ లో మద్యం పాలసీ స్కామిని సిఐడి చేత దర్యాప్తు చేయిస్తామని .. వేల కోట్ల లావాదేవీలు నగుదూ రూపం లో  జరిగాయని కాబట్టి ఈడీ కి కూడా సిఫార్సు చేస్తామని ఆయన అన్నారు .. ఆ తర్వాత టిడిపి నేతలు నుంచి సిఐడి నుంచి కానీ మద్యం స్కాం మనీ ల్యాండరింగ్ ఎలా జరిగిందో వివరిస్తూ పూర్తి ఆధారాల తో కేంద్రానికి ఫిర్యాదు కూడా చేశారు .. ఈడి కి వివరాలు ఇచ్చారు అయినా ఇంతవరకు ఈడి రంగంలో కి దిగలేదు .

సిఐడి విచారణలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఎలా దందా చేశాడో.. నగదు రూపంలో వసూలు చేసిన డబ్బులు అన్ని ఎవరికి చేరవేశారు మొత్తం కనిపెట్టారని చెబుతున్నారు . ఇలాంటి క్రమంలో ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు ముందుకు వచ్చి వేల కోట్ల వ్యవహారాన్ని తేల్చాల్సిన పని ఎంతైనా ఉంది .. కానీ టార్గెట్ గా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే వెళుతున్నారు .. కానీ అసలు నేరం జరిగిన చోటుకు మాత్రం వారు రావటం లేదు .  దీనికి కారణంగా నేరస్తులు హాయిగా తమ పనులు చేసుకుంటూ మిగిలిన స్కామ్ లపై చర్చలు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న నాయకులు దీనిపై ఆలోచిస్తే మంచిదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap