
అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను ఉద్దేశించే నాగబాబు పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేస్తారనేది బహిరంగ రహస్యమే .. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేశారు వర్మ .. అలాగే పొత్తులో భాగంగా పిఠాపురాన్ని వదులుకున్నారు .. మొదటి జాబితా లోనే ఆయనను శాసనమండలికి పంపిస్తామంటూ చంద్రబాబు ఆయనకు మంచి హామీ ఇచ్చారు . కానీ కూటమి అధికారులోకి వచ్చిన తర్వాత జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్మకు ఎలాంటి అవకాశం దక్కలేదు . అలాగే ఆయన స్థానాన్ని నాగబాబు తీసుకున్నారని అభిప్రాయం ఇప్పటికే రాజకీయాల్లో వినిపిస్తుంది .. ఇక దానికి అనుగుణంగా అదే నాగబాబు ఇప్పుడు జనసేన ఆవిర్భావ సభలో పరోక్షంగా వర్మను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయటంపై మరింత హాట్ టాపిక్ గా మారాయి.
ఇక జనసేన ఆవిర్భావ సభ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక పాత వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది .. అటు ఎన్టీఆర్ ఇటు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభిమానులు దీని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు .. మనకు కావాల్సింది కల్తీ నాయకులు కాదు నిజాయితీగల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావాలి పార్టీకి కష్టమొస్తే కాపాడుకునే యోధులు కావాలి అంటూ ఎన్టీఆర్ ఆ వీడియోలో మాట్లాడారు .. ఇక జనసేన సభ తర్వాత ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి వైరల్ చేస్తున్నారనేది తెలియటం లేదు .. కానీ టిడిపి జూనియర్ ఎన్టీఆర్ ఉమ్మడి ఫాన్స్ మాత్రం ఈ వీడియోని మాత్రం ఇప్పుడు తెగ వైరల్ చేసేస్తున్నారు .