
పరిపాలనల కోసం ఆఫీసులు శాసనమండలీలు హైకోర్టు వంటి వాటికోసం ఖర్చు చేయడం మంచిదే కానీ మిగిలిన వాటి సంగతేంటి అంటూ ప్రశ్నించడం జరిగింది.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో వారాహి సభలో ఉభయగోదావరి జిల్లాలను తాను దత్తకు తీసుకుంటానని తెలియజేశారని.. గోదావరి జిల్లాలో అభివృద్ధికి ఎలాంటి సౌకర్యాలు తెస్తున్నారో చెప్పాలి అంటూ లేఖలు హరి రామ జోగయ్య వెల్లడించారు.. విద్య,వైద్యం ,వ్యాపారం ,వ్యవసాయం,సాగునీరు ,తాగునీరు, ఓడరేవులు ఇతరత్రా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ తెలిపారు. ఈ విషయాల పైన సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.
ఎన్నో ఏళ్లుగా సమగ్ర అభివృద్ధికి సైతం గోదావరి జిల్లాలో నోచుకోలేదని కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో కూడా ఎలాంటి అభివృద్ధి అయినా పథకాలు కనిపించలేదు ఎంత ఖర్చు చేశారో ఒక వైట్ పేపర్ లో ఇవ్వాలి అంటూ డిమాండ్ చేయడం జరిగింది.. ప్రతి ఏడాది కూడా ఒకసారి ప్రతి జిల్లాకు చేసే ఖర్చుని వైట్ పేపర్లో రిలీజ్ చేస్తే ప్రజలు కూడా ఆనందపడతారు అంటూ తన లేఖ ద్వారా తెలియజేయడం జరిగింది హరి రామ జోగయ్య. మొత్తానికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి ఇలాంటి విషయాలను తీసుకువెళ్లడంతో మరి ఏం చేస్తారన్నది చూడాలి.