"జయకేతనం" అనే పేరుతో కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభ ఎంత సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే . ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఇచ్చిన స్పీచ్ హైలెట్గా మారింది . కొందరు ఇచ్చిన స్పీచ్ పెద్ద దుమారంగానే మారింది . మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు - పవన్ కళ్యాణ్ సారధ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం..జనసేన .. భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి భవిష్యత్తు ముఖచిత్రం ఎలా ఉండబోతుందనే విషయం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది .
అయితే ఇదే మూమెంట్లో పవన్ కళ్యాణ్ తమిళనాడు రాజకీయాలలో సైతం వేలు పట్టారు . డిఎంకె ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టారు. హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని తేల్చి చెప్పేశారు . హిందీ సినిమాలు డబ్ చేసి అలా వ్యాపారం చేసుకోవచ్చు కానీ హిందీ మాట్లాడకూడదా..? అంటూ స్ట్రైట్ గా ప్రశ్నించారు . అయితే ఇక్కడే పవన్ కళ్యాణ్ బాగా ఇరుక్కుపోయాడు. గతంలో గో బ్యాక్ హిందీ అంటూ నినాదాలు చేసింది పవన్ కళ్యాణ్ నే.. ఆ హాష్ ట్యాగ్స్ మరొకసారి బాగా ట్రెండ్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గతంలో గో బ్యాక్ హిందీ అంటూ చేసిన నినాదాలు అప్పట్లో ప్రచురితమైన దినపత్రిక క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు యూజర్లు . అంతేకాదు దానికి తోడు "ఛాంఏళేఓణ్" అనే ట్యాగ్ జోడిస్తున్నారు . అంటే ఊసరవెల్లి అని అర్ధం. ఒకప్పుడు ఒకలా ఇప్పుడు ఒకలా మాట్లాడుతున్నాడు అని .. ఊసరవెల్లి ఎలా రంగులు మారుస్తుందో అందరికీ తెలిసిందే. ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో జనసేన మీటింగ్ తర్వాత ఈ "ఛాంఏళేఓణ్" అనే పదం బాగా ట్రెండ్ అవుతుంది..!