
దానికి తోడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు... కూడా ఏ ఒక్క నాయకుడు, సినీ సెలబ్రిటీ అలాగే యాంకర్లకు గుర్తు ఉండటం లేదు. ఇలా ఏదో ఒక కారణం చేత కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. గ్రౌండ్ రియాల్టీ ప్రకారం... ఇప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం గ్యారంటీ అంటున్నాయి కొన్ని సర్వే సంస్థలు. అయితే ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ సర్కారు పైన... టాలీవుడ్ దర్శకుడు వివాదాస్పద పోస్ట్ పెట్టాడు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన అసహనం వ్యక్తం చేసిన కల్కి మూవీ డైరెక్టర్.. నాగ అశ్విన్... ఇదేం ఖర్మరా అంటూ పోస్ట్ పెట్టడం జరిగింది. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 400 ఎకరాల హైదరాబాద్ యూనివర్సిటీ భూములు అమ్మేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన... విమర్శలు చేసినట్లు... తెలుస్తోంది. హైదరాబాద్ యూనివర్సిటీ భూములు అమ్మేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ.. ఈ పోస్ట్ పెట్టాడట నాగ అశ్విన్.
అయితే నేరుగా... రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన విరుచుకు పడకుండా... పరోక్షంగా ఓ పోస్టు పెట్టుకున్నాడు నాగ్ అశ్విన్. అయినప్పటికీ ఈ పోస్టు తొందరగానే వైరల్ కావడంతో... కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏదైనా అంటే... ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు. అసలు నీ సినిమాలు ఆడకుండా చూస్తామని కూడా హెచ్చరిస్తున్నారు.. మరి దీనిపై నాగ అశ్విని ఎలా.. స్పందిస్తారో చూడాలి.