
అదే వేదిక మీద బందరు ఎంపీ ఉన్నాడు... మీ పార్టీ వాడే
ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చాక టీడీపీ అధిష్టానాన్ని కలిసాక
"టీడీపీలో అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. మీరు జనసేనలోకి వెళ్ళండి. బందరు వాళ్ళకే కేటాయించేలా ఉన్నాము" అని అన్నారో లేదో అడుగు...
100 స్ట్రైక్ రేట్ ఓకే... బట్ ప్లేయర్స్ లేరనే విషయం ఆ నడిపోడికి తెలియట్లేదా...
బూత్ లెవల్ కమిటీల కోసం కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని... వాళ్ళతో కలిసి బెంజి సర్కిల్ నుంచి రామవరప్పాడు రింగ్ వరకు నడిచి... వాళ్ళను నిలబెట్టలేదు.
టీడీపీని మీరు నిలబెట్టామని అనడం... అది విని అరవడం... కామెడీగా లేదా ? అని ప్రశ్నిస్తున్నారు.
దీనికి కౌంటర్‌గా జనసేన సోషల్ మీడియా వాళ్ల వెర్షన్ ఇలా ఉంది...
కొంతమంది పోస్టులు పెడుతున్నారు నాగబాబు గారు మాట్లాడినది తప్పు అని వాళ్లకు చెప్తున్నాం.. ఆయన అన్నదాంట్లో తప్పేముంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న నాయకుడు ఎవరు అవునన్నా కాదన్నా అలాంటి వ్యక్తిని నేను గెలిపించా అన్నప్పుడు ఎదుటివారికి మాట్లాడే హక్కు లేదా.. మరి మేము అనొచ్చు కదా మంగళగిరిలో లోకేష్ గారు చల్లపల్లి శ్రీనివాస్ గారి వల్ల గెలిచారని అనమంటారా.. నోటికి ఎదిస్తే అది మాట్లాడే వర్మ, మహాసేన రాజేష్ వంటి వాళ్ళని వెనకేసుకుని వస్తే మన విలువ పోతుందంటున్నారు.
పవన్ క్లియర్ గా చెప్పాడు కూటమి 15 సంవత్సరాలు కలిసే ఉంటుంది అని ... ఇలాంటి పోస్టులు పెట్టి మీరు కూటమిని బలహీన పరచాలని చూస్తే ఎక్కువగా నష్టం ఎవరికీ వస్తుంది అనేది రాష్ట్ర ప్రజానీకాన్ని మొత్తానికి తెలుసు.. అదే వర్మ తన టికెట్ ఇవ్వలేదని తన అనుచరుల చేత సీఎం గారిని లోకేష్ గారిని బండ బూతులు తిప్పించినప్పుడు ఏమైపోయారు మీరంతా.. అలాంటి వారి నోటికి ఈరోజు కళ్ళం వెయ్యలేకపోతే రేపటి రోజున కూటమి విచ్ఛిన్నం అవ్వటానికి కారకలు అవుతారు.. చంద్రబాబు నాయుడు గారు వర్మ గారికి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మొదటి తరంలోనే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తాను అన్నారు ఇప్పుడు మేము అనమంటారా? ఉల్లిపొర లాంటి మాటలు అని.. అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడాలి కానీ అవసరానికి మాట్లాడటం ఎవరికి మంచిది కాదని జనసేన వాళ్లు కౌంటర్లు ఇస్తున్నారు. ఏదేమైనా ఈ సోషల్ మీడియా వార్ అయితే మామూలుగా లేదు.