ఆధునిక జీవనశైలితో ఒత్తిడి అనేది సర్వసాధారణం అయిపోయింది. సిటీలు, పట్టణాల్లో చాలామంది, వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్యతో సతమతమవుతున్నారు. అయితే, ఈ పెరిగిపోతున్న టెన్షన్లకు చెక్ పెట్టడానికి జపాన్‌కు చెందిన ఓ అమ్మాయి మాత్రం భలే ఐడియాతో ముందుకొచ్చింది. జనాలు రిలాక్స్ అవ్వడానికి ఆమె ఒక వింత బిజినెస్ స్టార్ట్ చేసింది.

ఇక్కడ కస్టమర్లు ఆమె బ్రెస్ట్‌లను తాకి స్ట్రెస్ రిలీవ్ చేసుకోవచ్చట. వినడానికి కాస్త కొత్తగా, షాకింగ్‌గా ఉంది కదా. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. డైరెక్ట్‌గా టచ్ చేయడానికి మాత్రం ఆమె అస్సలు ఒప్పుకోదు. మరి ఎలా అంటారా, దానికోసం ఆమె ఒక స్పెషల్ సిలికాన్ బ్రెస్ట్ బాక్స్ రెడీ చేసింది. అచ్చం నిజమైన బ్రెస్ట్‌ల్లాగే ఉండే సిలికాన్ బ్రెస్ట్‌లను ఆ బాక్స్‌లో పెట్టింది. కస్టమర్లు ఆ బాక్స్‌లోని ఓపెనింగ్స్‌లో చేతులు పెట్టి వాటిని టచ్ చేయొచ్చు.

ఈ సర్వీస్ పొందాలంటే మాత్రం డబ్బులు కట్టాల్సిందే. ఇలా చేయడం వల్ల టెన్షన్ తగ్గి రిలాక్స్‌గా అనిపిస్తుందని ఆమె చెబుతోంది. ఈ ఐడియా చాలామందికి నచ్చేసింది. అందుకే అక్కడ క్యూ కడుతున్నారు. సర్వీస్ తీసుకున్నవాళ్లలో కొందరైతే నిజంగానే స్ట్రెస్ తగ్గిందని అంటున్నారు. కానీ, కొందరు మాత్రం ఇది మోసం అంటున్నారు.

అసలు విషయం ఏంటంటే కస్టమర్లు టచ్ చేసేది నిజమైన బ్రెస్ట్‌లు కాదు. బాక్స్‌లో ఉండే సిలికాన్ బ్రెస్ట్‌లు కృత్రిమంగా తయారుచేసినవి. వీటిని సాధారణంగా బ్రెస్ట్ సైజు పెంచుకోవడానికి లేదా షేప్ మార్చడానికి వాడుతుంటారు. దీంతో కొంతమంది ఇది అచ్చంగా మోసం అని ఫీలవుతున్నారు. ప్రకటనల్లో చెప్పినట్టుగా లేదని వాదిస్తున్నారు. అయితే ఇంకొందరు మాత్రం ఇందులో తప్పేం లేదని, రిలాక్స్ అయితే చాలు అంటున్నారు.

ఈ వింత బిజినెస్ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయిపోయింది. దీంతో రకరకాల చర్చలు మొదలయ్యాయి. కొందరు దీన్ని ఫన్నీగా, కొత్తగా ఉందని మెచ్చుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఇది కరెక్టేనా అని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఈ స్ట్రెస్ రిలీఫ్ సర్వీస్ మాత్రం అందరి దృష్టిని బాగా ఆకర్షించింది. ఒత్తిడిని తగ్గించుకునే కొత్త మార్గాల గురించి చర్చలు మొదలయ్యేలా చేసింది.

https://www.instagram.com/reel/DBS677dM_NV/?utm_source=ig_web_copy_link

మరింత సమాచారం తెలుసుకోండి: