
ఇదే క్రమంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి దాదాపు 4205 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తుంది .. అయితే ఇందులో 306 ఎకరాల వరకు ప్రభుత్వ భూములు ఉండగా .. మరో 3899 ఎకరాలు ప్రజలు దగ్గర్నుంచి సేకరించాల్సి ఉంటుంది .. ఇక అమరావతి ఓఆర్ఆర్ వరకు రెండు లింక్ రోడ్లను కనెక్ట్ చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ ప్రతిపాదించింది. అమరావతికి సమీపంలో ఉన్న చెనికాకాని దగ్గర ఉన్న నేషనల్ హైవే 16లో విజయవాడ పశ్చిమ బైపాస్ ను పొడిగిస్తూ ఆరు లైన్ల రహదారిని నందివెలుగు వరకు నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐ పలు కీలక సూచనలు చేసింది .. ఇక ఈ కొత్త రోడ్డు విజయవాడ పశ్చిమ బైపాస్ ఎన్హెచ్ 16 ని నందివెలుగు దగ్గర ఓఆర్ఆర్ కు కనెక్ట్ చేస్తారు .. ఇక ఈ రోడ్డుతో విజయవాడ తూర్పు బైపాస్ తో ఎలాంటి పని ఉండదు . ఇదే క్రమంలో చిన్న కాకాని దగ్గర ఉన్న ఎన్హెచ్ 16 తో పశ్చిమ బైపాస్ ను కలిపే చోట్ల చోట ప్లవర్‌లీఫ్ ఇంటర్‌ఛేంజ్‌ను నిర్మించబోతున్నారు .. బుడంపాడు వద్ద గుంటూరు హైవే జంక్షన్ నుంచి నారాకోడూరు వరకు దాదాపు ఆరు కిలోమీటర్లు పొడవున ఆరు లైన్ల రోడ్డు నిర్మాణం చేయబోతున్నారు .
అదే విధంగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును 11 ప్యాకేజీలగా విభజించి మూడు దశల్లో పనులు మొదలుపెట్టాలని చూస్తున్నారు .. ఇందులో మొదటి దశలో ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల నుంచి గుంటూరు జిల్లా పోతురు వరకు 63 కిలోమీటర్ల పడుగున .. ఇక రెండో దశలో గుంటూరు జిల్లా పోతురు నుంచి కృష్ణాజిల్లా పొట్టిపాడు వరకు మరో 65 కిలోమీటర్ల పొడవునా .. ఇక మూడో దశలో పట్టుపాడు నుంచి ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల వరకు 62 కిలోమీటర్ల పనులు మొదలుపెట్టి ఓఆర్ఆర్ ను నిర్మించే ప్లాన్ చేస్తున్నారు . ఇక ఈ ఔటర్ రింగ్ రోడ్ లో భారీ బ్రిడ్జి నిర్మాణం కూడా చేయనున్నారు.. అమరావతి నుంచి రోడ్లను నేషనల్ హైవే లకు కనెక్ట్ చేసే పనిలో ప్రభుత్వ అధికారులు బిజీగా ఉన్నారు .. ఈ మేరకు అవసరమైన ప్రాజెక్టులు కూడా రెడీ చేస్తున్నారు .. అదే విధంగా కరకట్ట పై రోడ్డును విస్తరించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే .. ఇక అమరావతి రింగ్ రోడ్డు తో అక్కడ ఉన్న భూముల ధరలకు రెక్కలు రావటం ఖాయం .. గుంటూరు , కృష్ణ , పల్నాడు , ఏలూరు జిల్లాలకు మహాదశ పట్టబోతుంది.