
అయితే ఇప్పుడు ఈ వివాదంపై పవన్ స్పందన వాటిని సినిమాల తో ముడిపెట్టారు .. తమిళ సినిమాల్లు హిందీలోకి డబ్బింగ్ చేసి గట్టిగా సంపాదించుకుంటున్నారు అన్నట్టుగా ఆయన అన్నారు . అయితే ఇది తమిళ మనోభావాలను గట్టిగా దెబ్బతీసింది . ఈ విధంగా తమిళనాడు నుంచి పవన్ పై తీవ్ర విమర్శలు రావడానికి ప్రధాన కారణం అవుతుంది .. రాబోయే రోజుల్లో పవన్ అక్కడ పర్యటిస్తే ఈ వ్యాఖ్యల కారణంగా ఆయనకు గట్టి వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా లేకపోలేదు . అలాగే గతంలో పవన్ కళ్యాణ్ దక్షిణాది ఉద్యమం కూడా మొదలుపెట్టారు .. ఓ ప్రత్యేక వేదిక కూడా పెట్టారు .. అలాగే ఉత్తరాది నేతల దౌర్జన్యం మనపై ఏమిటని కూడా ఆయన ప్రశ్నించారు .. హిందీని ఎందుకు నేర్చుకోవాలని కూడా ఆయన అన్నారు..
అయితే అప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో ఈ స్టాటజీ తీసుకున్నారు కానీ కొంతకాలానికి సైలెంట్ గా మారిపోయారు .. కానీ ఇప్పుడు ఆ వీడియోలు ట్వీట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి వస్తూ ఉంటాయి .. ఇప్పుడు వచ్చాయి కూడా ఉత్తరాది నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు మరోసారి వైరల్ చేసి ఆయన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు . ఇప్పుడు అటు తమిళనాడు ఇటు నార్త్ లో తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలతో పవన్ స్పందించారు . హిందీ ఇంగ్లీషులో వివరణ ఇచ్చారు .. అయితే ఇప్పుడు వాటిని ఎవరు అంతగా పట్టించుకోవడం లేదు .. రాజకీయంగా కీలకమైన అడుగులు వేసేటప్పుడు మాటలు జాగ్రత్తగా ఉండాలి జారకూడదు . కానీ పవన్ పిఠాపురం సభలో అచ్యుత్సాహంతో కొన్ని మాటలు అనేశారు . ఇప్పుడు వాటి రియాక్షన్ ఆయనపై ఏవిధంగా మారుతుందో చూడాలి.