
ఇక ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. పొట్టిశ్రీరాములు పేరు మార్చాల్సిన అవసరం ఏముంది? అంటూ నిలదీశారు. ఆయన గొప్ప దేశభక్తుడు...స్వాతంత్ర్య సమరయోధుడని తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. హరిజనోద్దరణ ఉద్యమం చేశారనే సంగతి మర్చిపోయారా? అంటూ నిలదీశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.
ఆంధ్రా మూలాలుంటే పేర్లు మార్చేస్తారా? అంటూ ప్రశ్నించారు. ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి పేర్లను కూడా మార్చే దమ్ముందా? అంటూ నిలదీశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ట్యాంక్ బండ్ పై ఉన్న ఆంధ్రుల విగ్రహాలను తొలగించే దమ్ముందా? అని ఫైర్ అయ్యారు. తక్షణమే చేసిన తప్పును సరిదిద్దుకోండని కోరారు. దేశభక్తులు, ఆర్యవైశ్యలకు క్షమాపణ చెప్పండని ఫైర్ అయ్యారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రకటించారు. ఇది రాసిపెట్టుకోండన్నారు. కాస్త ఓపిక పడితే... బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ .