
అయితే ఇప్పుడు ఈ అంశమే చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడిన మాటలు నాగబాబు మాట్లాడిన మాటలు చూస్తే జనసేన పార్టీ ఇంకా ఊహలలోనే ఉన్నదా అనే చర్చ కూడా మొదలవుతోందట. ఎన్నో ఏళ్ల ఉన్న టిడిపి పార్టీని తాము నిలబెట్టామని పవన్ చేసిన వ్యాఖ్యలు నేతలు కార్యకర్తలు ఎలా అర్థం చేసుకోవాలన్నదే ఇప్పుడు రాజకీయ అంశంగా మారింది. టిడిపి పార్టీ అంటే ఎంతో చరిత్ర కలిగి ఉన్న పార్టీ అంతేకాకుండా ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకున్నది.
జనసేన 2019 ఎన్నికలలో రెండు చోట్ల పోటీ చేయగా ఆయన ఓడిపోయారు.. అదే ఎన్నికలలో నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసిన నాగబాబు కూడా ఓడిపోయారు.. మరి ఒంటరిగా పోటీ చేస్తే ఎక్కడ గెలవలేని పరిస్థితి ఉన్నది. 2023 సెప్టెంబర్ లో చంద్రబాబు అరెస్టు తరువాత జనసేన, టిడిపి సానుభూతితో ఒకటి అయ్యి మద్దతు కోరుకోవడం జరిగింది. అలా టిడిపి, జనసేన ,బిజెపిలో 21 అసెంబ్లీ సీట్లు 2 ఎంపీ సీట్లను పొత్తుల తీసుకున్నది జనసేన. టిడిపి ఓటింగ్ పర్సంటేజ్ 45% ఉంటే జనసేనకు 6శాత్రమే ఉన్నది.
రెండు పార్టీలు కలవడం వల్లే విజయాన్ని భారీగా అందుకుందని ఏపీ అంతట విడిపించింది.. అంతేకాకుండా ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సీఎం అయినా కూడా అదంతా పవన్ దయ అన్నట్లుగా మాట్లాడారు మంత్రి నాదెండ్ల మనోహర్. మరి ఇదంతా అధికారం ఉందని ఉత్సాహంతో ఇలా ప్రకటనలు చేశారా లేకపోతే ఊహ లోకాలలో ఉన్నారా అన్న విషయం తెలియాల్సి ఉంది.. ఒకవేళ వీటి నుంచి బయటపడకపోతే రాబోయే రోజుల్లో కచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయని పలువురు కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నారు.. ముఖ్యంగా ప్రజలకు ఎవరికి మేలు చేస్తారనుకుంటేనే వారికి ఓటు వేస్తారని తెలియజేస్తున్నారు.