ఆంధ్రప్రదేశ్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో తాము టిడిపికి మద్దతు ఇచ్చి నిలబడటం వల్ల కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిందని జనసేన నేతలు తాజాగా పిఠాపురం సభలో వ్యాఖ్యానించారు .. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర హాట్ టాపిక్ గా మారుతున్నాయి .. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఎనిమిది నెలల్లో ఇలా తమ వల్లే టిడిపి గెలిచిందంటూ జనసేన చెప్పటం పై అన్ని పార్టీల్లోనూ గట్టి చర్చ జరుగుతుంది .. ఇక దీనిపై టిడిపి నేతలు అయితే జనసేన పై గట్టిగా మండిపడుతున్నారు .. సోషల్ మీడియాలోనూ జనసేన ను టార్గెట్ చేస్తూ పోస్టులు వస్తున్నాయి .. ఇక ఈ క్రమంలోని జనసేన కామెంట్స్ పై ప్రముఖ సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట‌ ఘాటుగా స్పందించారు .


ప్రధానంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను గెలిపించింది అక్కడ స్థానిక ఓటర్లే .. వారు కాకుండా ఇంకెవరైనా ఉన్నారను కుంటే వారి కర్మ స్థానిక టిడిపి నేత వర్మను ఉద్దేశించి జనసేన నాయకుడు నాగబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి .. ఇక దీని పై స్పందించిన సర్వేనిప్పుడు ప్రవీణ్ పుల్లట‌ .. ఓ ట్వీట్ చేశారు .. అందులో ఆయన ఈ విధంగా చెప్పుకొచ్చారు .. పిఠాపురం మాత్రమే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా గెలిపించింది ప్రజలు .. పార్టీ కార్యకర్తలే ! టిడిపి సపోర్ట్ లేకుంటే పాలకొండ , పోలవరం , రైల్వేకోడూరు లాంటి నియోజకవర్గాల్లో జనసేన గెలుపుకు అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పారు .



అలాగే మరికొన్ని చోట్ల జనసేన  వాళ్ల టిడిపి మెజారిటీ అందుకుంది .. ఇలా మొత్తంగా కూటమి మైత్రి వల్ల మాత్రమే అధికారంలోకి వచ్చామనుకోవటం  ఓ ఓ భ్ర‌మ‌ అని ప్రవీణ్ క్లారిటీ ఇచ్చారు .  జగన్ రెడ్డి నిర్ణయాలు మీద ఆయన ప్రభుత్వ వ్యతిరేకతతో మీరు అఖండ విజయం సాధించారని విషయం గుర్తు చేసుకుంటే మంచిదన్నారు . ఎప్పటికప్పుడు వైసీపీ సాధించిన ఓట్లు శాతం కూడా గుర్తుపెట్టుకోకుండా మీరు మూలాలు మర్చిపోతున్నారు .. ఇక చివరగా లాస్ట్ లైన్ అంటూ .. తెలుగుదేశం కష్టకాలంలో జనసేన ని ఆదుకున్నారని జనసేన  అన్ని సీట్లు గెలవడంలో టిడిపి కార్యకర్తల శ్రమ కష్టం ఉందని కూడా ఆయన అన్నారు .. అలాగే మిమ్మల్ని విడగొట్టడానికి ఎవరో రానక్కర్లేదు మీ భాగ్య స్వామి పార్టీలు చాలు అంటూ కూడా జనసేనకు ఆయన చురకలు అంటించిరు .. తద్వారా కూట‌మిలో విభేదాలకు కారణం కావొద్దు అంటూ జనసేనకు హెచ్చరికలు జారీ చేశారు .. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పక్కాగా గెలుస్తుందని చాలా ముందుగా సర్వే గణాంకాల్లో చెప్పిన వారిలో ప్రవీణ్ కూడా మొదటి స్థానంలో ఉన్నారు .



మరింత సమాచారం తెలుసుకోండి: