ఆంధ్రప్రదేశ్లోని కూట‌మి ప్ర‌హూత్వ‌నికి ప్రధాని నరేంద్ర మోడీకి భారీ షాక్ తగిలింది .. కూటమి ప్రభుత్వం లో భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ను నిరత్సాహ పరుస్తు కీలకమైన పథకానికి బ్రేక్ పడింది .. అసలే తెలంగాణ అభ్యంతరాలతో ఇబ్బంది పడుతున్న వేల కేంద్రం ఏపీ కి నెత్తి మీద పిడుగు పడినట్టుగా మారబోతుంది .. మరో పక్క కేంద్ర‌ నిర్ణయంతో తెలంగాణలోని రేవంత్‌ సర్కారుకు భారీ ఉరట లభించింది . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర పర్యావరణ అనుమతులు నిరాకరించింది .. గత నెల 27న నిర్వహించిన ఎక్స్ పర్ట్ అప్రైజల్ కమిటీ ఏపీ అనుమతుల కోసం చేసుకున్న దరఖాస్తుల అభ్యంతరాలు వ్యక్తం చేసింది .. ఇప్పుడు తాజాగా దీనిపై విడుదల చేసిన మినిట్స్ లో పర్యావరణ  అనుమతులు కోరేముందు ఎక్కడ ఎలాంటి ప‌నులు చేయలేదని పూర్తి ఆధారాలతో  అఫిడవిట్  దాఖ‌లు చేయాలని సూచించింది .
 

ఇక ఇదే సమయంలో తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ లో కేసును కూడా వేశారు .. ఇక ఇందులో ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు తొలి దేశ ప‌నుల‌కు అనుమతులు అవసరం లేదని కూడా వాదించింది .. ఇక దీంతో రెండవ దశ పర్యావరణ అనుమతులకు మాత్రమే దరఖాస్తు చేసింది .. ఇక ఇప్పుడు దీని పై స్పందించిన కేంద్ర పర్యావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దరఖాస్తులు తిరస్కరించింది . ఇక దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు నిరాకరించింది .

 

ఇక ఈ నిర్ణయం ఈ ఆంధ్రప్రదేశ్లోని కూట‌మి ప్రభుత్వానికి గట్టి షాక్ గా మారగా .. మరో పక్క తెలంగాణలోని కాంగ్రెస్ నేతృతంలో రేవంత్ సర్కార్ కు భారీ ఊరట ఇచ్చింది .. తమ ప్రభుత్వం నిరంతరాయంగా చేసిన ప్రయత్నాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేదని తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు .. అలాగే అంత ర్రాష్ట్ర నిబంధాలను ఉల్లంఘించి చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు నిరాకరించడం తెలంగాణ లోని కృష్ణ పరివాహక ప్రాంతాల్లో రైతులకు గట్టి మేలు చేసిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు .

మరింత సమాచారం తెలుసుకోండి: