జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్వహించిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పిఠాపురంలో చాలా గ్రాండ్గా జరిగాయి. అయితే ఇది పార్టీ కార్యకర్తలకు నేతలకు కొత్త జోష్ తీసుకువచ్చేలా చేస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ తగ్గిందనే విధంగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ మీటింగ్ పవన్ ఇమేజ్ ని కూడా డౌన్ చేసిందనే విధంగా చాలామంది విశ్లేషకులు తెలియజేస్తున్నారట.


పవన్ స్పీచ్ చాలా ఆవేశంగా ఉన్నది..కానీ ఎన్నో అనవసరపు మాటలు ప్రస్థానాలు తీసుకువచ్చారనే విధంగా తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ బిజెపికి తాను గట్టి మద్దతు దారడని చెప్పాలనుకున్నారా లేకపోతే జాతీయ రాజకీయాలలో వెళ్లాలనుకుంటున్నారనే విషయాలను ఇలా చెప్పినట్టుగా కనిపిస్తోందట. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఒక వీడియోని విడుదల చేశారు.. పవన్ కళ్యాణ్ 12 ఏళ్ల రాజకీయ ప్రస్తానాన్ని కూడా ఒక్క మాటలో చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.



ఒక నాయకుడు నిజాయితీగా తన గురించి తాను చెప్పే విషయాల పైన కూడా పవన్ పొంతన లేకుండా మాట్లాడుతున్నారంటూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ మాట్లాడారు. తాను ఎక్కడ పుట్టాను అనే విషయం పైన కూడా ఆయన ఎన్నో ఊళ్ళ  పేర్లు చెబుతూ ఉన్నారని ఎక్కడ చదివారనే విషయం పైన కూడా ఎన్నో విషయాలు చెబుతున్నారని. గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోలతో సహా సాక్షిగా చూపిస్తూ ఆయన గుర్తు చేశారట. పవన్ కళ్యాణ్ కి కులం మతం లేదని చెబుతూ ఉంటారు కానీ కాపులు తనకు ఓటు వేయలేదని అడుగుతూ ఉంటారు.. తాను బాస్టిజం తీసుకున్నానని చెప్పి మైనార్టీలు క్రిస్టియన్ లో ఓట్లు వేయించుకొని ఎన్నికలలో గెలిచిన తర్వాత సనాతనాన్ని మారడంపై కూడా ఘాటుగానే విమర్శించారు.. ఏపీలో ప్రజలకు మతోన్మాది లేదు కాబట్టే శాంతియుతంగా ఉన్నారు అంటూ తెలిపారు.

అసలు జనసేన పార్టీకి ఎలాంటి సిద్ధాంతం ఉంది అంటూ ఆయన ప్రశ్నించారు?. ఇలా ఇవే కాకుండా చాలా విషయాలను కూడా మాజీ ఐఏఎస్ అధికారి అడిగారు అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారుతున్నది. కానీ పవన్ కళ్యాణ్ ఈ మీటింగ్ తో అనేకమంది నుంచి విమర్శలు అందుకుంటూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: