ఏపీ రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారుతున్నాయి. ఒకవైపు ఎన్నికల వేడి రాజుకుంటోంది. మరోవైపు మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ సమయంలో వైఎస్ షర్మిల చేసిన తాజా వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ మీద షర్మిల చేసిన కామెంట్స్‌పై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే, షర్మిలక్కకు ఒక ఫ్రెండ్లీ సలహా ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అదేంటంటే.. పవన్ కళ్యాణ్ జోలికి వెళ్లొద్దని, ఎందుకని? అసలు ఏం జరుగుతోంది? చూద్దాం.

షర్మిల విమర్శలు చేస్తూ "పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు మార్చేశారు.. చెగువేరా, గద్దర్ సిద్ధాంతాలను వదిలేసి.. మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ భావజాలంలోకి వెళ్లిపోయారు. జనసేన పార్టీని మతసేనగా మార్చేశారు" అని షర్మిల గారు ఘాటుగా విమర్శించారు. అంతేకాదు.. "జనం కోసం పుట్టిన పార్టీ అని చెప్పి.. ఒక మతానికి అజెండాగా మార్చడం దారుణం" అని కూడా అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున మాట్లాడుతున్న షర్మిల గారు.. పవన్ కళ్యాణ్ మీద ఈ రేంజ్‌లో ఫైర్ అవ్వడం హాట్ టాపిక్ అయింది.

అయితే షర్మిల ఎవరినైనా విమర్శించొచ్చు.. జగన్‌ను తిట్టొచ్చు.. చంద్రబాబును దులిపేయవచ్చు .. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలంటున్నారు రాజకీయ పండితులు. ఎందుకంటే.. మీడియా లెక్కలు వేరు.

జగన్‌ను విమర్శిస్తే.. ఆయన శత్రు మీడియా దాన్ని హైలైట్ చేస్తుంది. చంద్రబాబును విమర్శిస్తే, లైట్ తీసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో సీన్ రివర్స్ అవుతుంది. పవన్‌ను విమర్శిస్తే.. టీడీపీ సైలెంట్ అయిపోతుంది.. కానీ జనసేన కార్యకర్తలు మాత్రం ఊరుకోరు, రెచ్చిపోతారు. అనవసరంగా రచ్చ అవుతుంది. షర్మిలక్కకు ఇది మైనస్ అవుతుంది. అందుకే పవన్ జోలికి వెళ్లకపోవడమే బెటర్ అంటున్నారు.

ఇంకా ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటి? "మేం మైనారిటీల కోసం పుట్టాం. ముస్లింల కోసం బతుకుతాం. క్రైస్తవుల కోసం కొట్లాడతాం. హిందువులను వేధిస్తాం" అని కాంగ్రెస్ పార్టీ గతంలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కేరళలో, బెంగాల్‌లో, ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ సిద్ధాంతాలను విమర్శించడం విడ్డూరంగా ఉంది. స్వతంత్ర సమరయోధుల ఆశయాలతో పుట్టిన పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్.. ఇప్పుడు మత పిచ్చి గురించి మాట్లాడటం ఏంటి?

మొత్తానికి షర్మిల పవన్ కళ్యాణ్ విషయంలో కొంచెం ఆలోచించి మాట్లాడితే బెటర్ అని సలహా ఇస్తున్నారు విశ్లేషకులు. లేదంటే.. అనవసరంగా రచ్చ జరిగి.. షర్మిలకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. చూడాలి మరి షర్మిల ఈ సలహాను వింటారో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి: