వైసిపి పార్టీ కీలక నేత, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కి ఊహించని పరిణామం ఎదురైంది. వైసిపి కీలక నేత అయిన వైవి సుబ్బారెడ్డి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వై వి సుబ్బారెడ్డి తల్లి... కాసేపటి క్రితమే మృతి చెందారు. వై వి సుబ్బారెడ్డి తల్లి ఎర్రం రెడ్డి పిచ్చమ్మ... అనారోగ్యంతో కాసేపటి క్రితమే మరణించారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వైవి సుబ్బారెడ్డి తల్లి ఎర్రం రెడ్డి పిచ్చమ్మ... రెండు రోజుల కిందట ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారట.

 
గడిచిన రెండు రోజులుగా ఆమెకు వైద్యులు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారట. ఆమెకు గుండెకు సంబంధించిన ఏదో వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఇతర షుగర్ అలాగే బిపి... రకరకాల వ్యాధులు ఉన్నాయట. వై వి సుబ్బారెడ్డి తల్లి ఎర్రం రెడ్డి పిచ్చమ్మ వయసు 84 సంవత్సరాలు. వయసు మీద పడడంతో... ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిందట. ఈ తరుణంలోనే రెండు రోజులుగా ఆసుపత్రిలో వైద్యం కూడా తీసుకుంటున్నారు.

 
కానీ ఆమె ఆరోగ్యం ఇవాళ ఉదయం మరింత విషమించిందట. ఈ నేపథ్యంలోనే వైవి సుబ్బారెడ్డి తల్లి ఎర్రం రెడ్డి పిచ్చమ్మ అనారోగ్యంతో ఒంగోలులోని ప్రైవేట్ ఆస్పత్రిలో కాసేపటి క్రితమే మరణించారు. ఈ విషయాన్ని వైసిపి కీలక నేత ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు ధ్రువీకరించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఢిల్లీలోనే వై.వి సుబ్బారెడ్డి ఉండడం జరిగింది. ఆయనకు తన తల్లి మరణం విషయం కూడా చెప్పడం జరిగింది. ఈ విషయం తెలిసిన వైవి సుబ్బారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

 
హుటా హుటిన ఢిల్లీ నుంచి.. ఆంధ్రప్రదేశ్ బయలుదేరారు వైవి సుబ్బారెడ్డి. ఇవాళ మధ్యాహ్నం లోపు ఒంగోలు చేరుకుంటారు వైవి సుబ్బారెడ్డి. ఆ తర్వాత వై వి సుబ్బారెడ్డి సొంత గ్రామం అయిన కోరిలపాడు లో అంత్యక్రియలు ఉండే అవకాశాలు ఉన్నాయి.  వైవి సుబ్బారెడ్డి తల్లి అంతక్రియలకు వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు ఆయన తల్లి విజయమ్మ కూడా హాజరయ్యే ఛాన్స్ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: