
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మధ్య వైర్యం వల్ల రాష్ట్ర నష్టపోయేలా జరుగుతోందంటూ ఆయన ఆరోపించారు. ఎవరో చేసిన తప్పుకు మరెవరో కూడా క్షమాపణ కోరడం ఏంటా అంటూ ఆయన ప్రశ్నించారు. ఆధ్యాత్మిక క్షేత్రంగా గుర్తింపు పొందిన కాశీనాయన క్షేత్రాన్ని కూల్చివేయడం వెనుక ఉన్న దుష్ట శక్తులు ఎవరో బయటపెట్టాలి అంటూ కూడా వైసిపి నేత కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. దీంతో హిందువులు కూడా ఆక్రమవుతున్నారంటూ తెలియజేశారు.
కాశీనాయన క్షేత్రాన్ని కూల్చివేయడం పైన సీఎం చంద్రబాబు ఎక్కడ ఎందుకు స్పందించలేదంటూ ఆయన ఆరోపించారు. చాలా దుర్మార్గంగా జరిగిన ఈ దాడి ఏ ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోందని తెలిపారు. ఈ కూల్చివేతలు అటవీ శాఖ పవన్ కళ్యాణ్ పరిధిలోనే ఉందంటూ తెలియజేశారు. సనాతన ధర్మము అంటూ చెప్పుకొచ్చే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే తెలిపారు. ఇప్పుడు ఎందుకు గొంతు మూగ పోయింది అంటూ ప్రశ్నించడం జరిగింది వైసీపీ నేత. తిరుపతిలో జరిగిన తొక్కి సలాటలో భాగంగా అక్కడికి వెళ్లి క్షమాపణలు చెప్పిన పవన్ ఇప్పుడు కాశీనాయన క్షేత్రాన్ని ఎందుకు పరిశీలించలేదంటూ నిలదీశారు. పవన్ కళ్యాణ్ కి బదులుగా నారా లోకేష్ క్షమాపణలు చెప్పడం.. తన సొంత డబ్బుతోనే భవనాన్ని నిర్మిస్తానంటూ లోకేష్ చెప్పారు.