
వైసీపీ హయాంలో రూ.4,200 కోట్లు బకాయిలు పెట్టారు. అవునో, కాదో చెప్పాలి. వివరాలు పంపిస్తాం. స్కూల్ ఫీజు రీయింబర్స్ మెంట్, పీజీ ఫీజు రీయింబర్స్ మెంట్ వివరాలన్నీ అందులో ఉన్నాయి. 2019లో ఆనాటి ప్రభుత్వం పెట్టిన బకాయిలను 16 నెలల తర్వాత వైసీపీ ప్రభుత్వం చెల్లించింది. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలే అయింది. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు కచ్చితంగా చెల్లిస్తాం. హౌస్ సాక్షిగా హామీ ఇచ్చాను. చర్చలో వైసీపీ సభ్యులు లేకపోతే నేనేం చేయగలను. బీఏసీలో విద్యారంగంపై చర్చ కావాలని అడిగితే ఒప్పుకున్నాం. కానీ ఆ చర్చకు వైసీపీనే లేదు. వాస్తవాలు వినడానికి సిద్ధంగా లేరు. ప్రభుత్వం ఇచ్చిన వివరాలు పూర్తిగా చదవాలన్నారు. విద్యార్థుల జీవితాలతో వైసీపీ ప్రభుత్వం చెలగాటమాడిందని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ధ్వజమెత్తారు. వసతి దీవెన ఏనాడు సక్రమంగా చెల్లించలేదని మండిపడ్డారు.