- ( గుంటూరు - ఇండియా హెరాల్డ్ ) . . .

వైసీపీ నుంచి జంప్ అవుతున్న నాయ‌కుల జాబితా ఎప్ప‌టిక‌ప్పుడు పెరిగి పోతూ వ‌స్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు కీల‌క నేత‌లు ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఈ లిస్టు లోనే మ‌రో కీల‌క నేత కూడా వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ముహూర్తం సెట్ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌ల్నాడు జిల్లా లోని చిల‌క‌లూరి పేట కు చెందిన మాజీ ఎమ్మెల్యే ... ప్ర‌స్తుత వైసీపీ ఎమ్మెల్సీ మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ఇప్ప‌టికే పార్టీ మారుతున్న‌ట్టు కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ను టీడీపీ లోకి తీసుకు వెళ్లేందుకు న‌ర‌సారావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవ‌రాయులు గ‌త కొద్ది రోజుల నుంచి చేస్తోన్న ప్ర‌య‌త్నాలు ఎట్ట‌కేల‌కు ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్టుగా స‌మాచారం.


ఇదిలా ఉంటే ఇప్పుడు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ బాట‌లోనే మ‌రో కీల‌క వైసీపీ టాప్ లీడ‌ర్ కూడా పార్టీ మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న‌ట్టుగా తెలుస్తోంది. ఆమె వైసీపీ లో ఒక‌ప్పుడు ఒక వెలుగు వెలిగిన మ‌హిళా లీడ‌ర్ కావ‌డం విశేషం. ఆ మ‌హిళా నేత ఎవ‌రో ?  కాదు మాజీ హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌. ఈ ఇద్ద‌రు నాయ‌కులు కూడా జ‌న‌సేన పార్టీ వైపు ఒక‌రు.. టీడీపీ వైపు మ‌రొక‌రు చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మ‌ర్రి కి ఉన్న ఎమ్మెల్సీ కంటిన్యూ చేస్తామ‌న్న హామీ తో ఆయ‌న్ను టీడీపీ లోకి తీసుకు వెళ్లేందుకు ఎంపీ లావు ఏర్పాట్లు చేస్తున్నారు.


ఇక సుచరిత విష‌యానికి వ‌స్తే ఆమెను జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో ఆమె సొంత నియోజ‌క‌వ‌ర్గం ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గం అయిన ప్ర‌త్తిపాడు నుంచి తాడికొండ కు బ‌ల‌వంతంగా మార్చారు. ఆమెను నియోజ‌క‌వ‌ర్గం నుంచి మార్చ‌డంతో  హ‌ర్ట్ అయ్యారు. తాడికొండలో అయిష్టంగానే పోటీ చేశారు. అప్ప‌టి నుంచి సుచ‌రిత కూడా పార్టీ మారే ఏర్పాట్ల‌లో ఉన్నారు. ఏదేమైనా  ఈ ఇద్ద‌రు లీడ‌ర్లు పార్టీ మారితే అది ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో పార్టీకి పెద్ద ఎదురు దెబ్బే అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: