
అయితే నారా లోకేశ్ ను సీఎం చేసే విషయంలో చంద్రబాబు నిర్ణయం ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. లోకేశ్ ను సీఎం చేయాలనే ప్రతిపాదన పెడితే జనసేన ఏ విధంగా రియాక్ట్ అవుతుందో అనే చర్చ కూడా సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే మాత్రం లోకేశ్ ను సీఎం చేయడం మరీ కష్టం అయితే కాదని కచ్చితంగా చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
రాబోయే రోజుల్లో లోకేశ్ ను సీఎం చేయాలనే ఒత్తిడి సైతం పెరగనుంది. 2029 ఎన్నికలు లోకేశ్ సీఎం అని జరగాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తెలుగు తమ్ముళ్ల అభిప్రాయం ఉంది. కొన్ని ప్రాంతాల్లో తెలుగు తమ్ముళ్లకు అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన వ్యక్తం అవుతూ ఉండటం గమనార్హం.
మరి రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. రాష్ట్రంలో ఐదేళ్లకు ఒకసారి అధికారం మారుతున్న నేపథ్యంలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. ఏపీలో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గే దిశగా అడుగులు పడితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రతిపాదనలపై లోకేశ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. నారా లోకేశ్ కెరీర్ ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. నారా లోకేశ్ భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలి.