
ఆ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వైయస్ రాజశేఖర్ రెడ్డి సొంత జిల్లా ఆయన కడప జిల్లా పేరును సైతం వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చడం జరిగింది.. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి పార్టీ భారీ విజయాన్ని అందుకోవడంతో.. వైయస్సార్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి తమ సొంత జిల్లా అవ్వడంతో వైయస్సార్ అనే పేరు పెట్టారు. వైయస్సార్ కడప జిల్లా అనే పేరులో కడప పేరును తీసేసి వైయస్సార్ గా మార్చారు. ఇప్పుడు దానిని కూటమి ప్రభుత్వం మళ్లీ వైయస్సార్ కడప జిల్లాగా మార్చడం జరిగింది. అలాగే వైయస్సార్ తాడిగడప మునిసిపాలిటీ పేర్లను సైతం తాడిగడప మునిసిపాలిటీగా పేరు మార్చిన ప్రతిపాదనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నిన్నటి రోజున జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారట. అంతేకాకుండా పలు రకాల కీలకమైన బిల్లులను కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం.
ఈ రోజున క్యాబినెట్ సమావేశంలో యూనివర్సిటీస్ యాక్ట్ -2016 సవరణ బిల్లును కూడా ఆమోదం చేసినట్లుగా తెలుస్తున్నది. అలాగే చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని అలాగే పవర్లూమ్ యూనిట్లు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామంటూ తెలిపిన కూటమి ప్రభుత్వం అమలు చేసినట్లుగా తెలిపింది. వీటితో పాటుగా షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ పైన కూడా నిర్ణయం తీసుకోవడమే కాకుండా ,అమరావతి టవర్లు ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నారట.